థర్మల్‌ స్కానర్‌తో ఉష్ణోగ్రత చూడాలి

ABN , First Publish Date - 2021-05-09T04:07:30+05:30 IST

ఫీవర్‌ సర్వేలో భాగంగా వైద్య బృందాలు ఇంటిం టికి వెళ్లినప్పుడు ఒక్కొక్కరిని ధర్మల్‌ స్కానర్‌తో ఉష్ణోగ్రతను చూడాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదే శించారు.

థర్మల్‌ స్కానర్‌తో ఉష్ణోగ్రత చూడాలి
ఇంటింటి సర్వేలో జనంతో మాట్లాడుతున్న కలెక్టర్‌

 - లక్షణాలు ఉంటే కరోనా కిట్‌ ఇవ్వాలి

- లక్షణాలు ఉన్న వారిని మూడు రోజుల తర్వాత  పరీక్షించాలి

- ఫీవర్‌ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) మే 8 : ఫీవర్‌ సర్వేలో భాగంగా వైద్య బృందాలు ఇంటిం టికి వెళ్లినప్పుడు ఒక్కొక్కరిని ధర్మల్‌ స్కానర్‌తో ఉష్ణోగ్రతను చూడాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదే శించారు. శనివారం ఆయన పట్టణంలోని పలు కాలనీల్లో ఫీవర్‌ సర్వేను తనిఖీ చేశారు. ఝాన్సీ నగర్‌, హనుమాన్‌నగర్‌లలో నిర్వహిస్తున్న సర్వే ను కలెక్టర్‌ ప్రత్యక్షంగా పరిశీలించి కాలనీవా సుల తో మాట్లాడారు. వైద్య బృందాలు ఇంటికి వచ్చి సర్వే చేస్తున్నారా..? ఎలాంటి వివరాలు అడుగుతు న్నారు..? జ్వరం దగ్గు, జలుబు ఉన్న వారి వివరా లను సేకరిస్తున్నారా...? మీరందరు పూర్తి వివరాల ను సర్వే బృందాలకు ఇస్తున్నారా..? అని అడిగారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే ఖచ్చితం గా సర్వే బృందాలకు తెలియజే యాలని కోరారు. లక్షణాలు ఉన్నట్లైతే వారిని ధర్మల్‌ స్కానర్‌ ద్వారా స్కానింగ్‌ చేసి ఉష్ణోగ్ర తను తెలుసుకోవాలని, పల్స్‌ఆక్సీమీటర్‌ ద్వారా ఆక్సిజన్‌ స్థాయిని తెలుసు కొని సమస్య ఉన్నట్లైతే ఆసుపత్రికి పంపించా లన్నారు. లేదంటే కరోనా కిట్‌ఇచ్చి ఇంట్లోనే ఉండి మందులు వాడాలని బృందాలకు సూచించారు. తిరిగి మూడు రోజుల తర్వాత లక్షణాలు ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లి పరీక్ష చేయాలని, తగ్గకపోతే వారిని ఆసుపత్రికి రెఫర్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ శశికాంత్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T04:07:30+05:30 IST