క్రీస్తు బోధనలు ఆదర్శం

ABN , First Publish Date - 2021-12-16T05:08:09+05:30 IST

ఏసుక్రీస్తు బోధనలు విశ్వశాంతికి ఆదర్శమని, క్రీస్తు చూపిన మార్గంలో నడవా లని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

క్రీస్తు బోధనలు ఆదర్శం
కొవ్వొత్తులు వెలిగిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, క్రైస్తవ సోదరులు

- మంత్రి డాక్టర్‌ వి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌/ మహబూబ్‌నగర్‌ పద్మావతీ కాలనీ, డిసెంబరు 15 : ఏసుక్రీస్తు బోధనలు విశ్వశాంతికి ఆదర్శమని, క్రీస్తు చూపిన మార్గంలో నడవా లని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. క్రిస్మస్‌ వేడు కల్లో భాగంగా బుధవారం రాత్రి ఎంబీసీ చర్చిలో జరిగిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు, క్రైస్తవ సోదరులతో కలిసి కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. అనంతరం క్రైస్తవ సోదరులు కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్‌ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారని, పాలమూరులోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో పండగను జరుపుకుంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. పాలమూరులోనూ క్రైస్తవుల సంక్షేమం కోసం తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని చెప్పారు. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, చర్చిఫాదర్‌ రెవరెండ్‌ వరప్రసాద్‌, డా.శామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-16T05:08:09+05:30 IST