పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
ABN , First Publish Date - 2021-08-26T04:38:40+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీపీవో సురే ష్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

అమరచింత ఆగస్టు 25 : ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీపీవో సురే ష్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మండలం లోని ఈర్లదిన్నె, మస్తిపూర్, నందిమల్ల క్రాస్ రోడు, సింగంపేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ఆయన పరిశీలించారు. పాఠశాల భవన ఆవరణలో శానిటేషన్ చేయించాలని ఆదేశించారు. మండలంలోని 13 ప్రాథమిక పాఠశాలలు, మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్, రెండు జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలల్లో అధికారులు శానిటేషన్ చేయిం చాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పాఠశాల లు మూతపడడంతో అపరిశుభ్రంగా ఉంటాయని, పాఠశాల భవనాల పరిసరాలను పరిశుభ్రంగా ఉం చాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మా స్క్‌లను ధరించేటట్లు, భౌతిక దూరాన్ని పాటించేట ట్లు, శానిటైజర్‌ను ఉపయోగించేటట్లు ఉపాధ్యాయు లు చర్యలు తీసుకోవాలని డీపీవో ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతిఫరోసియా, ఎంపీవో రాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు చుక్కా ఆశిరెడ్డి, సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి
వీపనగండ్ల : రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. పాఠ శాలలను పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీవో కతలప్ప, ఎం ఈవో లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. మండల కేంద్రంలోని బాలికో న్నత పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను, గడ్డిని బుధవారం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల పా దులు తీసి శుభ్రం చేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యే స మయానికి పాఠశాలను పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచు నరసిం హారెడ్డి, కాంప్లెక్స్ పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, పంచా యతీ కార్యదర్శి, టీఆర్‌పీ వెంకటేష్, నాగరాజు ఉన్నారు.