ఆకాశమే హద్దు..

ABN , First Publish Date - 2021-01-14T03:43:13+05:30 IST

గగన వీధిలో క్రీడాకారులు అద్భుతం చేశారు.

ఆకాశమే హద్దు..
పారామోటార్‌ను నడిపిస్తున్న పైలెట్‌

- ప్రారంభమైన ఎయిర్‌  షో అండ్‌ పారామోటార్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

- ఏరో స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు 15 ఎకరాలు కేటాయించాం

- పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, జనవరి 13 : గగన వీధిలో క్రీడాకారులు అద్భుతం చేశారు. పారాష్యూట్లు, మోటార్లతో చేసిన విన్యాసా లతో ప్రేక్షకులను కనువిందు చేశారు. దేశంలోనే మొదటి సా రిగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం లో బుధవారం జరిగిన ఎయిర్‌  షో అండ్‌ పారామోటార్‌ చాం పియన్‌ షిప్‌ 2021 పోటీలను పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ప్రేక్షకుల మధ్య కూర్చొని పోటీలను తి లకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలమూరు యువతను పారామోటార్‌ పైలెట్లుగా, నేవిలో రాణించేలా తీ ర్చిదిద్దేందుకు ఉదండాపూర్‌-కర్వెన ప్రాజెక్టుల మధ్య ఏరో స్పో ర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు 15 ఎకరాల స్థలం కేటాయించామని చె ప్పారు. త్వరలో ట్రైనింగ్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. దే శంలోనే తొలిసారిగా ఈ క్రీడలు పాలమూరులో జరుగుతు న్నందుకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కాగా, పది రాష్ర్టాలకు చెందిన పారామోటార్‌ పైలెట్లు పోటీలలో పాల్గొ న్నారు. పారామోటార్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, స్కై డైవ్‌ పోటీ లు జరుగుతుండగా, 17న పోటీలు ముగియనున్నాయి.

పోటీల సందర్భంగా గుజరాత్‌కు చెందిన క్రీడాకారుడు జడే జా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తాను ఎనిమిది సార్లు అంత ర్జాతీయ పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. మొదట్లో ఆకాశంలో ఎగరాలంటే భయం వేసేదని, శిక్షణ తీసుకున్న ఆ భయం పో యిందని అన్నారు. మహారాష్ట్రకు చెందిన మరో క్రీడాకారుడు సాజిద్‌ మాట్లాడారు. పాలమూరులో వాతావరణం చాలా బా గుందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పోటీల్లో తానే మొట్టమొదటి పైలెట్‌గా పార్యాష్యూట్‌తో గగనవీధిలో విహ రిస్తూ, నిర్దేశించిన పాయింట్‌లో విజయవతంగా ల్యాండ్‌ కావ డం సంతోషంగా ఉంది.Updated Date - 2021-01-14T03:43:13+05:30 IST