విద్యుత్‌ ఉద్యోగుల త్యాగం వెలకట్టలేనిది

ABN , First Publish Date - 2021-08-22T03:58:18+05:30 IST

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో గతేడాది జరిగిన ప్రమాదంలో విధి నిర్వహణలో అసువులు బాసిన ఉద్యోగుల త్యాగం వెలకట్టలేనిదని సీఈ రామసుబ్బారెడ్డి పేర్కొ న్నారు.

విద్యుత్‌ ఉద్యోగుల త్యాగం వెలకట్టలేనిది
విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అమరులైన ఉద్యోగుల సంతాస సభ

దోమలపెంట, ఆగస్టు 21: శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో గతేడాది జరిగిన ప్రమాదంలో విధి నిర్వహణలో అసువులు బాసిన ఉద్యోగుల త్యాగం వెలకట్టలేనిదని సీఈ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం జెన్‌కో యాజయాన్యం ఆధ్వర్యంలో సంతాస సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరులైన వారి చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఈ మాట్లాడుతూ తమ ప్రాణాలు పోతాయనీ తెలిసి కూడా వేల కోట్ల సంపదను కాపాడేందుకు చివరి క్షణం వరకు పోరాడి అసువులు బాసిన ఉద్యోగులను జాతి ఎప్పటికీ మరవదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు సద్గుణకుమార్‌, రవీంద్రకుమార్‌, ఇంజినీయర్ల సంఘాల నాయకులు అనిల్‌కుమార్‌, మదన్‌మోహన్‌రెడ్డి, జానకిరాం, కార్మిక సంఘాల నాయకులు యాదయ్య, రాఘవేందర్‌రెడ్డి, మల్లేష్‌రెడ్డి, రాము, తిరుపతయ్య పాల్గొన్నారు.Updated Date - 2021-08-22T03:58:18+05:30 IST