ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

ABN , First Publish Date - 2021-10-20T05:13:58+05:30 IST

మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ముస్లిం సోదరులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ
పేటలో మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీలో పాల్గొన్న మైనార్టీలు

మస్జీద్‌లలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

నారాయణపేట, అక్టోబరు 19 : మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ముస్లిం సోదరులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ప్రతీ సంవత్సరంవలే ఈ సంవత్సరం కూడా మస్జిద్‌లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మౌలానాలు మస్జిద్‌లలో మహ్మద్‌ ప్రవక్త జీవి త చరిత్ర గురించి వివరించారు. జిల్లా కేంద్రమైన నారాయణపేటలో  ఉదయం లాల్‌ మస్జిద్‌ నుంచి మిలాద్‌ ఉన్‌ నబీ కమిటీ, బువ్వమ్మ గుట్ట దర్గా పీఠాధిపతి గయాసుద్దిన్‌ ఖాద్రి ఆధ్వర్యంలో మైనార్టీల భారీ ర్యాలీ పురవీధుల గుండా బువ్వమ్మ గుట్టకు చేరుకోగా పెద్ద సంఖ్యలో మైనార్టీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అబ్దుల్‌ సలీం, అమీరుద్దిన్‌, సర్ఫరాజ్‌, దస్తగిరి చాంద్‌, షఫీ చాంద్‌, నవాజ్‌, యూసూఫ్‌ తాజ్‌, అజర్‌, మహ్మద్‌ ఖురేషి పాల్గొన్నారు. కాగా ఎస్పీ చేతన మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ప్రార్థన మందిరాల దగ్గర పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా జరిగిన ర్యాలీతో పాటు పండుగ ఉత్సవాలపై ఎప్పటికప్పుడు పోలీస్‌ అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.  

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మజా పంపిణీ..

టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్‌ ఆఽధ్వర్యంలో చౌక్‌ బజార్‌లో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద ముస్లింలకు స్వాగతం పలు కుతూ మాజాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మహిమూద్‌, జాకీర్‌ హజారి, తాజుద్దీన్‌, దస్తగిరి చాంద్‌, అజారుద్దిన్‌, పాజలత్‌, గందె చంద్రకాంత్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కన్న జగదీశ్‌, మాజీ చైర్మన్‌ సరాఫ్‌ నాగరాజ్‌, రాజవర్దన్‌రెడ్డి, వినోద్‌, ప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్లు గురు లింగప్ప, అనిత సుభాష్‌, విజయలక్ష్మీ, వినోద్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో..

మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ర్యాలీగా వచ్చిన మైనార్టీలకు యువజన కాంగ్రెస్‌ నేత చిట్టెం అభిజయ్‌రెడ్డి సెంట్రల్‌ చౌక్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సం దర్భంగా చిట్టెం అభిజయ్‌రెడ్డి మాట్లాడుతూ మహ్మద్‌ ప్రవక్త చూపిన మార్గం అనుసరణీయ మని అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కె ట్‌ చైర్మన్‌ సుధాకర్‌, జలీల్‌, హస్నోద్దిన్‌, యూసూఫ్‌ తాజ్‌, ప్రకోద్‌ పాల్గొన్నారు. 

నారాయణపేట రూరల్‌ : మండలంలోని కొల్లంపల్లి, కోటకొండ, జాజాపూర్‌ గ్రామాల్లో మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొల్లంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ప్రత్యేక పార్థనలు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ముస్లీం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

ధన్వాడ : మండల కేంద్రమైన ధన్వాడలో మంగళవారం ముస్లిం సోదరులు మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మస్జిద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహ్మద్‌ ప్రవక్త ప్రవచనలు చదవి వినిపించారు. కార్యక్రమంలో షాకీర్‌ హుస్సేన్‌, డీలర్‌ బాబ, సోహేల్‌, తాజోద్దీన్‌, ఖయ్యుం పాల్గొన్నారు.

మాగనూర్‌ : మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీని మండలంలో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజు, హోటల్‌ బాబు, సుల్తాన్‌ మునాఫ్‌, మాజీ సర్పంచ్‌ ఆనంద్‌గౌడ్‌, చెన్నప్ప, చాంద్‌బాషా, నబీ పాల్గొన్నారు.

నారాయణపేట టౌన్‌ : మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదిన వేడుకలను మంగళవారం దామరగిద్ద మండలంలో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వమించారు. ఈ సందర్భంగా ఖాజమియా, ఉస్మాన్‌ మాట్లాడుతూ మహ్మద్‌ ప్రవర్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. నారాయణపేటలో జరిగిన వేడుకలకు దామరగిద్ద మండలం నుంచి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు కోప్షన్‌ మెంబర్‌ మహ్మద్‌మునీర్‌, ఇస్మాల్‌, నవాబ్‌ పాల్గొన్నారు.

 కోస్గి : మహ్మద్‌ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మిలాద్‌ ఉన్‌ నబీ పండగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం కోస్గి పట్టణంలో ముస్లిం సోదరులు, మైనార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు.  కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకల్లో పాల్గొని పండగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు, టీఆర్‌ఎస్‌, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా కోస్గి మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మ్యాకల శిరీష, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు రాజేశ్‌ ముస్లిం సోదరులకు మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.Updated Date - 2021-10-20T05:13:58+05:30 IST