బీజేపీ పోరాట ఫలితమే పీఆర్సీ: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-03-25T03:46:54+05:30 IST
ఉద్యోగులు, ఉపాధ్యా యులు, నిరుద్యోగుల పక్షాన బీజేపీ చేసిన పోరాటాల వల్లే సీఎం కేసీఆర్ ది గొచ్చి పీఆర్‌సీ ప్రకటన చేశారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరు ణ అన్నారు.

- జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
మహబూబ్‌నగర్ (భగీరథ కాలనీ), మార్చి 24 : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల పక్షాన బీజేపీ చేసిన పోరాటాల వల్లే సీఎం కేసీఆర్ దిగొచ్చి పీఆర్‌సీ ప్రకటన చేశారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరు ణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతుందనే సంకేతాలు రావడంతో, ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించి 29 శాతం పిట్‌మెంట్ ఇస్తామని లీకులిచ్చి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. 60 నెలలకు రావాల్సిన ఫిట్‌మెంట్‌ను 27 నెలలకు పరిమితం చేస్తే, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లకు పెంచడం వల్ల నిరుద్యోగులకు అన్యా యం జరుగుతోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రిటైరవ్వాల్సిన 50 వేల మంది ఉద్యోగాల్లో కొనసాగుతారని, దీంతో 50 వేల కొత్త ఉద్యోగాలను పొందే అవకాశాన్ని నిరుద్యోగులు కోల్పోతున్నారని ఆమె అన్నారు. సమావేశంలో నాయకులు పడాకుల బాలరాజు, రాంచంద్రయ్య, జయశ్రీ, అంజయ్య, రామాంజనేయులు, చెన్నవీరయ్య పాల్గొన్నారు.
అనంతరం నూతన కలెక్టరేట్ సమీపంలో భారత మాల రహదారి వెళుతుందని భావిస్తున్న ప్రాంతాన్ని పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌తో కలిసి డీకే అరుణ పరిశీలించారు. అక్కడే విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుత డిజైన్ ప్రకారం పేదలు, రైతులు, బలహీన వర్గాలకు చెందిన భూములు రోడ్డు నిర్మాణానికి సేకరించాల్సి వస్తుందని, దీంతో వారు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. దీనికి బదులు భూత్పూర్ ఫ్లైఓవ ర్ చివరి నుంచి అమి స్తాపూర్, అల్లీపూర్ మీదుగా తీసుకెళ్లేలా డి జైన్ రూపొందించేలా జాతీయ రహదారుల సంస్థ పరిశీలించాలని ఈ సందర్భంగా డీకే అరుణ కోరారు.