గులాబీ జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2021-09-03T04:48:27+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనానికి కేసీఆర్‌చే శంకుస్థాపన జరగబోతుందని టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు.

గులాబీ జెండా రెపరెపలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ జెండా ఎగురవేస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

నారాయణపేట, సెప్టెంబరు 2: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనానికి కేసీఆర్‌చే శంకుస్థాపన జరగబోతుందని టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధ్యక్షుడు రాజవర్దన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించగా కార్యక్రమంలో పుర చైర్‌ పర్సన్‌ అనసూయ, పుర వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, ఏఎంసీ చైర్మన్‌ జగదీశ్‌ పాల్గొన్నారు. 

నారాయణపేట రూరల్‌ : నారాయణపేట మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ జెండాను ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, విండో చైర్మన్‌ నర్సింహరెడ్డి, సిద్రామప్ప, హన్మంతు, మాజీ మండలాధ్యక్షుడు రాములు, రైతు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రాములుగౌడ్‌, సుభాన్‌రెడ్డి, విశ్వనాథ్‌, బాలప్ప, రామునాయక్‌, మోహన్‌నాయక్‌, రాంమోహన్‌, బాలమణి పాల్గొన్నారు. 

మక్తల్‌/రూరల్‌/కృష్ణ/మాగనూర్‌ : మునిసిపాలిటీ పరిధిలోని 3వ వార్డు చెన్నకేశవనగర్‌లో టీఆర్‌ఎస్‌ జెండా సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా కృష్ణ మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. మాగనూర్‌ మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి నివాళిఅర్పించిన అనంతరం టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాష, మార్కెట్‌ చైర్మన్‌ రాజేష్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జడ్పీటీసీ వెంకటయ్య, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేష్‌గౌడ్‌, జడ్పీటీసీ వెంకటయ్య, మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజు, అశోక్‌గౌడ్‌, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. 

కోస్గి/ఊట్కూర్‌/దామరగిద్ద : కోస్గి మునిసిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజేశ్‌, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ శిరీష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రామకృష్ణ పాల్గొన్నారు. ఊట్కూర్‌ మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం టీఆర్‌ఎస్‌ జెండాను ఆవి ష్కరించారు. దామరగిద్ద మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు ఆశన్న జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, విండో అధ్యక్షు డు ఈదప్ప, రైతు సమితి జిల్లా నాయకుడు వెంకట్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, భీమయ్యగౌడ్‌, శరణప్ప ఉన్నారు. 



Updated Date - 2021-09-03T04:48:27+05:30 IST