కేసీఆర్ నేతృత్వంలోనే రైతు రాజ్యం
ABN , First Publish Date - 2021-10-30T04:32:48+05:30 IST
రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోనే రైతు రాజ్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై రైతులకు ఎంతోప్రేమ ఉందన్నారు.
- ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి
- పలు గ్రామాల్లో రైతువేదిక
భవనాలు ప్రారంభం
- సాగునీరందించడమే ప్రధాన లక్ష్యం
నారాయణపేట టౌన్, అక్టోబరు 29: రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోనే రైతు రాజ్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై రైతులకు ఎంతోప్రేమ ఉందన్నారు. శుక్రవారం నారాయ ణపేట జిల్లాలోని దామరగిద్ద మండలంలో కూర్తి, అన్నాసాగర్, కాన్‌కూర్తి గ్రామాల్లో రైతు వేదికలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింద న్నారు. కరోనా సమయంలో కూడా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 5వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. కేవలం దామరగిద్ద మండలం లోనే రైతులకు 25 కోట్లకుపైగా రైతుబంధు ద్వారా అందిందన్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయొద్దని స్పష్టం చేసిందని, అయినా కూడా ప్రభుత్వం ప్రతీ రైతు పండించిన వరిని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అన్నదాతలను సంఘ టితం చేసి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలనే ఉద్దేశంతోనే రైతువేదికలు నిర్మించా మని, రైతుల శ్రేయస్సు, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ వేదికల ద్వారా సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు రైతులకు దిశానిర్దేశం చేయాలన్నది సీఎం ఆలోచన అన్నారు. ఉల్లిగుండం గ్రామంలో పాఠశాలను ఏడవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఈ ప్రాంత రైతులకు సాగు నీరందించి వారికళ్లలో ఆనందం చూడడమే తన ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఇట్లాపూర్ గ్రామంలో గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ నిర్మల, ఎంపీపీ బక్కనర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర కుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ శ్యాసం రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ వెంకటమ్మ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆశన్న, ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, పరశురామ్ రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ఉల్లిగుండం సర్పంచ్ కిష్టారెడ్డి, కిషన్ రావు, విండో అధ్యక్షుడు ఈదప్ప, తిప్పన్న, భీమయ్య గౌడ్, శరణప్ప, గురు, వ్యవసాయశాఖ జిల్లా అధికారి జాన్ సుధాకర్, హార్టికల్చర్ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.