నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనుల వేగం పెంచాలి

ABN , First Publish Date - 2021-11-24T04:32:21+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా నర్సింగ్‌ కళాశాల పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కు మార్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనుల వేగం పెంచాలి
పనుల వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌

-  కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా నర్సింగ్‌ కళాశాల పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కు మార్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ పట్టణ శివారులో ఉయ్యాలవాడ వద్ద నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పను లను మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు.  రూ.28కోట్లతో సుమారు లక్ష చదరపు అడుగుల పరిధిలో నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల పనుల ప్రగతిని ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఫేంత్‌ భీమ్‌ నిర్మాణ పనులు ప్రో గ్రెస్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. మెడి కల్‌ కళాశాలకు అనుబంధంగా నిర్మిస్తున్న నర్సిం గ్‌ కళాశాల జీప్లస్‌టు పనులను ,  నాణ్యతతో చేపట్టే విధంగా ఇంజనీరింగ్‌ అధికారులు నిరంత రం పరిశీలిస్తూ ఉండాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ భాస్కర్‌, డీఈ రమాదేవి, జేఈ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

అర్హులకు జాబ్‌కార్డులు అందించాలి

 అర్హులైన వారికి ఉపాధి హామీ జాబ్‌కార్డులు అందించి జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉ పాధి హామీ పథకం పనులను, జలశక్తి అభియా న్‌ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వర్తించాల ని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. మంగళ వారం బిజినేపల్లి మండలం పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కృషి విజ్ఞాన్‌ కేంద్రం సమా వేశ మందిరంలో మహాత్మాగాంధీ, జాతీయ ఉ పాధి హామీ పథకం పనులు, జలశక్తి అభియాన్‌ నిర్వహణపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈసీలు, ఏపీవోలు, టీఏలకు ఒక రోజు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వ ర్యంలో నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన  కలెక్టర్‌  మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల రి జిస్టర్‌ నమోదు సక్రమంగా నిర్వహించాలని, అ ర్హులైన వారికి జాబ్‌కార్డులు అందించాలని సూ చించారు. పనులు జరిగే ప్రదేశాల్లో బోర్డులు ఏ ర్పాటు చేసి పూర్తి వివరాలు నమోదు చేయాల న్నారు.  నర్సరీల నిర్వహణ పనులు వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులతో పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్ర కృతి వనాల పనులను వెంటనే చేపట్టాల న్నారు. గ్రామీణ స్థాయి లో జలశక్తి అభియాన్‌ పనులను మండల స్థాయి అధికారుల పర్యవేక్షణతో సమర్థ వంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించా రు. మండలస్థాయిలో జరిగే అభివృద్ది కార్యక్రమా లపై ఎంపీడీవోలు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొన సాగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, డీఆర్‌డీవో నర్సింగరావు, డీపీవో క్రిష్ట, జిల్లా భూగర్భజల అధికారిణి రమాదేవి, అ దనపు డీఆర్‌డీవో రాజేశ్వరి, ఏవో నటరాజ్‌, కృషి విజ్ఞాన్‌ కేంద్రం కో ఆర్డినేటర్‌ ప్రభాకర్‌రెడ్డి,  ఆర్‌పీ లుగా నాగర్‌కర్నూల్‌ ఎంపీడీవో కోటేశ్వర్‌, కల్వకుర్తి ఏపీవో చంద్రసిద్దార్థ, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T04:32:21+05:30 IST