ప్రమాదవశాత్తు వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-03-23T05:23:52+05:30 IST

నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీ పరిధిలోని దేశీ ఇటిక్యాల గ్రామానికి చెందిన చిన్నారెడి(60)ప్రమాదవ శాత్తు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ప్రమాదవశాత్తు వృద్ధుడి మృతి
మృతి చెందిన చిన్నారెడ్డి

నాగర్‌కర్నూల్‌ క్రైమ్‌,  మార్చి 22: నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీ పరిధిలోని దేశీ ఇటిక్యాల గ్రామానికి చెందిన చిన్నారెడి(60)ప్రమాదవ శాత్తు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వద్ద ఉన్నసెల్‌ఫోన్‌ ఆధారంగా దేశీ ఇటిక్యాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు మృతుడి బంధువులకు సమాచారం అందించారు. బంధువులు సంఘటనా స్థలానికి వస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది.Updated Date - 2021-03-23T05:23:52+05:30 IST