పల్లెలకు ప్రకృతి అందాలు

ABN , First Publish Date - 2021-10-26T04:40:35+05:30 IST

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అందంగా ముస్తాబై ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పట్టణాల్లోని జనం పార్కులకు వెళ్లి సరదాగా గడుపుతుండగా, గ్రామాల్లోనూ ఆ సౌకర్యం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఊరికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.

పల్లెలకు ప్రకృతి అందాలు
జిల్లెల గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం

కల్వకుర్తి, అక్టోబరు 25: పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అందంగా ముస్తాబై ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పట్టణాల్లోని జనం పార్కులకు వెళ్లి సరదాగా గడుపుతుండగా, గ్రామాల్లోనూ ఆ సౌకర్యం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఊరికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎకరా భూమిలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి, 4 వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం చెప్పింది. అయితే గ్రామాల్లో భూమి లభ్యతను బట్టి వనాలను ఏర్పాటు చేశారు. ఆ మేరకు మొక్కలు నాటారు. ఉసిరి, జామ, నేల తంగడి, గన్నేరుతో పాటు పలు రకాల పూలు, పండ్ల మొక్కలు, ఆయుర్వేద మొక్కలు నాటారు. కల్వకుర్తి మండలంలోని జిల్లెల్ల, తాండ్ర, జీడిపల్లి, వేపూరు, ఎంగంపల్లి తదితర గ్రామాల్లో ప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దారు. తాండ్ర గ్రామంలో పాఠశాల వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనంలో ఆయుర్వేద మొక్కలు నాటారు.

Updated Date - 2021-10-26T04:40:35+05:30 IST