మానవత్వం చాటిన వైద్యసిబ్బంది

ABN , First Publish Date - 2021-05-09T03:46:09+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో ఓ మహిళ కు శనివారం కరోనా పాజిటివ్‌ ని ర్ధారణ కావడంతో పాటు షుగుర్‌ లెవెల్‌ పెరిగాయి.

మానవత్వం చాటిన వైద్యసిబ్బంది
కరోనా పేషెంట్‌ను అంబులెన్స్‌ దగ్గరకు మోసుకెళ్తున్న వైద్యసిబ్బంది అబ్రహాం, లక్ష్మి

 గద్వాలక్రైం, మే 8 : జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో  ఓ మహిళ కు శనివారం కరోనా పాజిటివ్‌ ని ర్ధారణ కావడంతో పాటు షుగుర్‌ లెవెల్‌ పెరిగాయి. దాంతో ఆమెను పట్టుకునేందుకు ఎవరూ రాకపోవడంతో చివరకు వైద్య సిబ్బంది అబ్ర హాం, ఆశావర్కర్‌ లక్ష్మి మానవత్వ దృక్పథంతో సహాయం చేశారు. ఇందుకు సంబంధించి స్ధానికుల తె లిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వా ల పట్టణంలోని అశోక్‌నగర్‌కు చెంది న మహిళ (58)కు ఇంటిదగ్గర కరోనా పరీక్ష చేయగా, పాజిటివ్‌ ని ర్ధారణ అయ్యింది. అదే సమయంలో ఆందోళన చెందడంతో ఆమెకు షుగుర్‌ లెవల్‌ ఒక్కసారిగా పెరగడంతో వెంటనే వైద్యసిబ్బంది అబ్రహాం అంబులెన్స్‌ను పిలిపించారు. కానీ పాజిటివ్‌ కావడంతో ఆమెను పట్టుకునేందుకు చుట్టు పక్కల వారు ఎవరు ముందుకు రాలేదు. వారి ఇళ్లు చిన్న సందులో ఉండడంతో చివరకు మానవతా దృక్పథంతో వారి బంధువులతో పాటు వైద్యసిబ్బంది స్టక్చర్‌పై అంబులెన్స్‌ దాకా తీసువచ్చి జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-05-09T03:46:09+05:30 IST