పిడుగు పడి వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2021-05-20T05:42:07+05:30 IST
నారాయణపేట జిల్లాలో బుధవారం సాయం త్రం పిడుగుపడి వేర్వేరుచోట్ల ము గ్గురు మృతిచెందారు.

నారాయణపేట క్రైం/కృష్ణ, మే 19 : నారాయణపేట జిల్లాలో బుధవారం సాయం త్రం పిడుగుపడి వేర్వేరుచోట్ల ము గ్గురు మృతిచెందారు. పేట మండలం అప్పక్‌పల్లి గ్రామంలో ఒకరు, కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రా మంలో ఇద్దరు మృతి చెం దారు. అప్పక్‌పల్లిలో మహేశ్ (23) బుధవారం సా యం త్రం పిడుగు పాటుకు గు రై మృతి చెందాడు. మహేశ్ తన పొలం వద్ద కట్టేసిన ఎ ద్దులను తీసుకొచ్చేందుకు సాయంత్రం పొలానికి వెళ్లా డు. ఈ క్రమంలో పిడుగుపాటుకు గురైమృతి చెందాడు.
కృష్ణా మండలం గుడేబల్లూర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్ (12)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందా డు. అదే సమయంలో కుర్వ తిమ్మప్ప (48) అనే వ్యక్తి గొర్రెల మందలో ఉండగా పిడుగుపడి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో నాలుగు గొర్రెలు కూడా మృతి చెందా యి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మురళి తెలిపారు.