భార్యను హత్య చేయించిన భర్త

ABN , First Publish Date - 2021-02-02T03:04:59+05:30 IST

భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేయించాడు. రోడ్డు ప్రమా దంలో చనిపోయినట్లు ఫిర్యాదు చేశాడు.

భార్యను హత్య చేయించిన భర్త
వివరాలు వెల్లడిస్తున్న భూత్పూర్‌ సీఐ రజిత

మహబూబ్‌నగర్‌: భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేయించాడు. రోడ్డు ప్రమా దంలో చనిపోయినట్లు ఫిర్యాదు చేశాడు. విచారణలో భర్తనే ఏ1 నిందితుడుగా తేలడంతో కటక టాల వెనక్కి పంపించారు. వివరాలను భూత్పూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ రజిత సోమవారం వెల్లడించా రు. సీసీకుంట మండలం బండర వల్లికి చెందిన బుడగ జంగం రవితో మాలతికి 2017లో వివాహం జరిగింది. కొన్నాళ్ల తరువాత భార్యపై రవి అనుమానం పెంచుకున్నాడు. విషయం గ్రామంలో తెలిస్తే అవమానపడాల్సి వస్తుందని ఆమెనే హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వరుసకు సోదరులైన రామాంజనేయులు, రమేశ్‌తో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. నల్గొండ జిల్లా డిండికి చెందిన వీరి స్నేహితుడు, లారీ డ్రైవర్‌ కేతావత్‌ వినోద్‌ లారీతో ఢీకొట్టించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్‌ వేశారు. అందు కోసం లారీ ఇన్స్‌రెన్స్‌కు వచ్చే రూ.15 లక్షలు ఇస్తానని వినోద్‌ను ఒప్పించారు. అనుకున్న ప్రకారం గత నెల 25న సాయంత్రం మాలతి వ్యవసాయ పొలం నుంచి కట్టెల మోపుతో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి లారీతో ఢీకొట్టారు. దాంతో మాలతి అక్కడిక్కడే చనిపోయింది. కేసును ఛేదించిన పోలీసులకు అసలు విషయాలు తెలియడంతో బుడగ జంగం రవి, వినోద్‌లను అరెస్ట్‌ చేశారు. మిగతా ఇద్దరు పరారిలో ఉన్నారు. 

Updated Date - 2021-02-02T03:04:59+05:30 IST