హస్తకళలు అద్భుతం

ABN , First Publish Date - 2021-11-27T04:28:21+05:30 IST

విద్యార్థుల హస్తకళలు అద్భుతంగా ఉన్నాయని, చదువుతో పాటు ఆట, పాటల్లో, కళల్లో రాణించాలని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు.

హస్తకళలు అద్భుతం

నారాయణపేట, నవంబరు 26 : విద్యార్థుల హస్తకళలు అద్భుతంగా ఉన్నాయని, చదువుతో పాటు ఆట, పాటల్లో, కళల్లో రాణించాలని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో కేంద్ర మాన వవనరుల అభివృద్ధి విభాగం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కళా ఉత్సవ్‌ రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్‌ హస్తకళ పోటీలను నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి డీఈవో హాజరై మాట్లాడారు. విద్యార్థులకు కళలపై ఆసక్తిని పెంచి వారి నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కళాఉత్సవ్‌ కార్యక్రమం చేప ట్టిందన్నారు. అనంతరం హస్త కళలను తిలకించి అభినందించారు. అంత కుముందు బాల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని కళాకారుడు లక్ష్మణ్‌ బాలకేంద్రం సూపరింటెండెంట్‌ మహిపాల్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో డీఈవో కార్యాలయ సూపరింటెం డెంట్‌ లక్ష్మీకాంత్‌, విద్యాశాఖ అధికారులు శ్రీని వాస్‌, విద్యాసాగర్‌, పద్మనళిని, గోపాల్‌, భాను ప్రకాష్‌, అధికారులు శ్రీనివాస్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T04:28:21+05:30 IST