అందరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-06-23T04:27:02+05:30 IST

అం దరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని హౌసింగ్‌ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

అందరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి
దివిటిపల్లిలో కేసీఆర్‌ కాలనీ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

- పంజాబ్‌ను మించి ధాన్యాన్ని పండించాం 

- హౌసింగ్‌ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి 


మహబూబ్‌నగర్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : అం దరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని హౌసింగ్‌ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన కేసీఆర్‌ కాలనీ (1024 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు)లో వంద మంది లబ్ధిదారులకిచ్చిన ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం, ఏనుగొండ-పాలకొండ-భూ త్పూర్‌ రోడ్డు వరకు నిర్మించిన బైపాస్‌ రోడ్డును పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. బై పాస్‌ రోడ్డు వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం రాష్ట్రమే ర్పాటయ్యాక సీఎం కేసీఆర్‌ అహోరాత్రులు శ్రమించి పని చే యడం వల్లే ఒక్కో కల సాక్షాత్కారమవుతుందని అన్నారు. చా లా మంది కుక్కల వలె మెరుగుతున్నారని, వారికి తాను స వాల్‌ విసురుతున్నానని చెప్పారు. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి గృహ నిర్మాణ పథకం అమలు చేస్తున్నారా అని నిలదీశారు. రూ.19 వేల కోట్లతో 2.70 లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించే ప్రణాళిక రాష్ట్రంలో అమలవుతోందని చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతు భీమా, ధాన్యం కొనుగోళ్లు జరిపిన ప్ర భుత్వం దేశంలో ఎక్కడై నా ఉందా అని ప్రశ్నించారు. దేశంలో పంజాబ్‌ని దాటి ధాన్యం పండించిన రాష్ట్రమని చెప్పారు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండితే, 90 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొను గోలు చేసిందని వివరించారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు అమలు చేయలేని వారు, ఇక్కడ కేసీఆర్‌ చేస్తే మొ రుగుతున్నారని విమర్శించారు. అభివృద్ధి చేసే శ్రీని వాస్‌గౌడ్‌ ను ఆశీర్వదించాలని, ఆటంకాలు సృష్టించే వారిని నిల దీయా లని ప్రశాంత్‌రెడ్డి కోరారు.

మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ అర్హులైన పేదలంద రికీ ఇళ్లిప్పిస్తామని చెప్పారు. దివిటిపల్లిలో కాలనీకి నీటి ఏర్పా టు కోసం ప్రయత్నిస్తే పైపులైన్లు వేయకుండా కేసులు వేసి అడ్డుకున్నారని దుయ్యబట్టారు. దివిటిపల్లి మాదిరిగానే జిల్లా లో అన్నిచోట్లా పేదలకు ఇళ్లిప్పిస్తా మని, సొంతస్థలాలున్న వారికి కట్టుకునేందుకు ఆర్థిక సహా యం చేసే పథకం కూడా త్వరలో రాబోతోందని వివరించారు. సమైక్య పాలనలో ఒక్క జూరాలే గగనమని, నేడు అంతకు ఐదు రెట్లు సామర్థ్యం గల ఉదండాపూర్‌, కర్వెన రిజర్వాయర్లు పాలమూరుకు కుడి, ఎడ మలుగా వస్తున్నాయని అన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌ అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభవృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వరరెడ్డి, కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అ దనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌ నందలాల్‌పవార్‌, గ్రంథాలయ, మునిసిపల్‌ చైర్మన్లు రాజేశ్వర్‌గౌడ్‌, కేసీ నరసిం హులు, హౌసింగ్‌ పీడీ భాస్కర్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ వెంకట య్య, ఎంపీపీ సుధాశ్రీ, సర్పంచ్‌ జరీనాబేగం పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:27:02+05:30 IST