ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-31T06:07:50+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు శాస్త్రీయంగా నిర్వహించక ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటోందని ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ సంపత్‌కుమార్‌ అన్నారు.

ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంపత్‌కుమార్‌

- జీఓ 317ను సవరించాలి - ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 30 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు శాస్త్రీయంగా నిర్వహించక ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటోందని ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ సంపత్‌కుమార్‌ అన్నారు. ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన జీఓ 317ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగేలా జీఓను సవరించాలని డిమాండ్‌ చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌లుగా నియమితులై ఇంక్రిమెంట్‌లతో, సీనియారిటీతో జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందారని, వాళ్ల కేడర్‌ టీచర్‌గానే ఉంటుందని, అలాంటి వాళ్లను ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గద్వాల, అలంపూర్‌, కొడంగల్‌ నుంచి కాళేశ్వరం, ఆదిలాబాద్‌, మంచిర్యాల వంటి ప్రాంతాలకు నియమించడం ఎంత వరకు సబబని ఆయన పేర్కొన్నారు. కనీసం పక్కపక్క జోన్లకైనా పోస్టింగ్‌లు ఇవ్వాలే తప్ప రాష్ట్రంలో ఒక చివరలో ఉన్న ఉద్యోగులను మరో చివరికి బదిలీ చేయడం సహేతుకం కాదన్నారు. ఉద్యోగుల పరిస్థితి ఏ వర్గానికి కూడా రా కూడదని, కాంగ్రెస్‌ పార్టీ మీకు అండగా ఉంటుందని, న్యాయం జరిగేవరకు పోరాడుతుం దని అన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జోనల్‌ వ్యవస్థనే అశాస్త్రీయంగా ఉందంటే ఉద్యోగ బదిలీల ప్రక్రియ మరిం త దారుణంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, పట్ణ ణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌ యాదవ్‌, మీడియా సెల్‌ ఇన్‌చార్జి బెనహర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T06:07:50+05:30 IST