ఒక్క రోజులో రాష్ట్ర భవితవ్యం మారుతుంది
ABN , First Publish Date - 2021-11-29T05:02:42+05:30 IST
బహుజన సమా జ్ పార్టీ రాజ్యం వస్తే ఒక్క రోజులోనే తెలంగాణ భవితవ్యం మారుతుందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.

- బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- మెడికల్ కళాశాల నిర్మాణం కోసం
దళిత, గిరిజనుల భూములే
గుర్తుకొచ్చాయా?
- పాలకులుగా ప్రగతి భవన్‌కు
పోవాల్సిన సమయం వచ్చింది
వనపర్తి టౌన్, నవంబరు 28: బహుజన సమా జ్ పార్టీ రాజ్యం వస్తే ఒక్క రోజులోనే తెలంగాణ భవితవ్యం మారుతుందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో దగా పడుతున్న దళిత, గిరిజన, నిరుద్యోగ, రైతన్నల తల రాతలు మార్చే శక్తి ఒక్క నీలి కండువాకు మాత్రమే ఉందన్నారు. బంగారు తెలంగాణ అంటే భూములు లాక్కొవడమేనా అని అన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు దళిత, గిరిజనులు సాగు చేసుకుం టున్న భూములే గుర్తుకు వచ్చాయా అని మంత్రి నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించారు. వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, ప్రకృతి వనాలు, పార్కులు వంటివి ఏవి ఏర్పాటు చేయాలన్న దళిత, గిరిజనులకు సాగు కోసం ఇచ్చిన అసైండ్ భూములే గుర్తుకొ స్తున్నాయని మండిపడ్డారు. బాధలో ఉన్న ప్రతీ ఒక్కరి దగ్గరికి వెల్లి ఓదార్చేదే బీఎస్పీ అని అన్నారు. ప్రగతి భవన్‌లోకి పోవాల్సి న సమయం ఆసన్నమైందని, అది పాలకులుగా నా, లేక సేవకులుగానా అనేది ప్రతీ ఒక్క బహు జనుడు ఆలోచించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టిన పాలకుల గురించి చెప్పాలంటే ఒక్క సంవత్సర కాలం కూడా సరిపోదని విమర్శిం చారు. బతుకమ్మ చీరలు మాకు, పట్టు చీరలు మీకా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ గడీల పాలకుల ప్రభుత్వాన్ని కూల్చేవాడే బీఎస్పీ కార్య కర్త అని అన్నారు. మనది దోపిడిని, దగపడ్డ బతు కులపై, నిరుద్యోగుల, వీఆర్ఏల, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, కార్మికుల, ఫీల్డ్ అసిస్టెంట్ల, వరి కొనుగోలు కోసం పోరాడుతున్న రైతన్నల పక్షాన ప్రశ్నించి పోరాడేదే బీఎస్పీ అని అన్నారు. రాను న్న రోజుల్లో తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగుర వేసే వరకు బీఎస్పీ కార్యకర్త కంకణ బద్దుడై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కోఆర్డినేటర్ ఏబీజే సత్యం సాగర్, జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ఉపాధ్యక్షుడు చిరంజీవి, గడ్డం మహేష్, గట్టు మన్నెం, ఎల్లస్వామి తదితరు లు పాల్గొన్నారు. అంతకుముందు మహాత్మా జ్యోతి రావు పూలే, అంబేడ్కర్, కాన్షీరాంల చిత్రపటాలకు పూలమాలతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఘనంగా నివాళి అర్పించారు. ఆయన సమక్షంలో దాదాపు 500 మంది పార్టీలో చేరారు.