ఉద్యోగుల విభజన పూర్తి

ABN , First Publish Date - 2021-12-27T04:31:01+05:30 IST

పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌ నుంచి ఎస్సైల వరకు ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తయింది.

ఉద్యోగుల విభజన పూర్తి

 మహబూబ్‌నగర్‌, డిసెంబరు 26 : పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌ నుంచి ఎస్సైల వరకు ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తయింది. జిల్లా పోలీస్‌ యంత్రాంగం 15 రోజు లుగా చేస్తున్న  కృషి ఎట్టకేలకు పూర్తయింది. విభజన తర్వాత తలెత్తనున్న పరిణా మాలపై పోలీసు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ముందుగా జరిగిన కాని స్టేబుల్‌ విభజనతో అనూహ్యంగా సైబరాబాద్‌లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా నుంచి పెద్దమొత్తంలో కానిస్టేబుళ్లను సైబరాబాద్‌కు అలాట్‌ చేయాల్సి వచ్చింది. కానిస్టేబుల్‌ పోస్ట్‌ జిల్లా పోస్ట్‌ కావడంతో మొదటి ప్రాధాన్యం పెట్టుకున్న చోటనే పోస్టింగ్‌ ఉంటుందని, రెండో ఆప్షన్‌లో ఏదో నామ్‌కేవాస్తేగా పెట్టుకోగా చాలామందికి అదే సమస్యగా మారింది. రెండో ఆప్షన్‌గా సైబరాబాద్‌ పెట్టుకున్న వారందరినీ అక్క డికి అలాట్‌ చేయడంతో కంగుతిన్నారు. 2009 బ్యాచ్‌ను కటాఫ్‌గా తీసుకుని బదిలీలు చేశారు. ఇలా 100 మందికి పైగా జిల్లా నుంచి సైబరాబాద్‌కు కేటాయించగా ప్రస్తుతం పాలమూరు జిల్లాలో కానిస్టేబుళ్ల కొరత ఏర్పడింది. ఇది వరకే ఇక్కడ కొత్తగా ఏర్పాటైన పోలీస్‌ స్టేషన్‌లకు పక్కస్టేషన్‌లనుంచి సిబ్బందిని సర్దుబాటు చేయగా కొత్తగా మరో వంద మంది వెళ్లిపోనుండటంతో ఖాళీల సంఖ్య మరింత పెరగనుంది. కొత్త రిక్రూట్‌మెంట్‌ చేపడితేనే ఈ ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా హెడ్‌కానిస్టేబుల్‌, ఏఎస్సై, ఎస్సై స్థాయి అధికారుల విభ జన ప్రక్రియ కూడా పూర్తయింది. చాలా స్టేషన్‌ లలో రైటర్‌ల సమస్య ఉంది. కోర్టు కానిస్టేబుల్‌, రిసెప్షనిస్ట్‌ లు ఉండాలి. ఇప్పుడు ఉద్యోగ విభజన అనంతరం అన్ని స్టేషన్‌లలో రైటర్‌లు, రిసెప్షనిస్ట్‌ లు, కోర్టు కానిస్టేబుళ్లు తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నందున వారిని సర్దుబాటు చేసుకునే పనిలో ఎస్‌ హెచ్‌వోలు బిజీగా ఉన్నారు. ఒక స్టేషన్‌లో వీరి సంఖ్య ఎక్కువగా.. మరో స్టేషన్‌లో తక్కువగా ఉంటే సర్దుబాటు చేసుకోవాల్సిందిగా ఉన్న తాధికారుల సూచన మేరకు అన్ని కేడర్‌లలో సర్దుబాటు చేసుకునే పనిలో ఉన్నారు. ఇదే విషయమై ఆదివారం సాయంత్రం జిల్లా ఉన్నతాధికారి అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌ హెచ్‌వోలతో సమావేశమయ్యారు. డిసెంబ రు 31, ఒమైక్రాన్‌ కట్టడిపై దృిష్టి సారించా ల్సి ఉన్నందున త్వరలోనే అన్ని స్టేషన్‌లలో సిబ్బంది సర్దుబాటు పూర్తి చేసు కొని శాంతి భద్రతలపై దృిష్టి సారించాలని ఎస్పీ  సూచించినట్లు తెలిసింది.  



Updated Date - 2021-12-27T04:31:01+05:30 IST