ప్రజల రక్షణ బాధ్యత జిల్లా పోలీస్‌ శాఖదే

ABN , First Publish Date - 2022-01-01T04:30:47+05:30 IST

ప్రజల రక్షణ, భద్రత బాధ్యత జిల్లా పోలీస్‌శాఖదేనని ఎస్పీ ఎన్‌.వెం కటేశ్వర్లు అన్నారు.

ప్రజల రక్షణ బాధ్యత జిల్లా పోలీస్‌ శాఖదే
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు

నారాయణపేట క్రైం, డిసెంబరు 31: ప్రజల రక్షణ, భద్రత బాధ్యత జిల్లా పోలీస్‌శాఖదేనని ఎస్పీ ఎన్‌.వెం కటేశ్వర్లు అన్నారు.   గత ఏడాది నారాయణపేట జిల్లా పోలీస్‌శాఖ సాధించిన పురోగతి వివరాలను శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణ కేసులు 403 నమోదు కాగా, 332 ట్రాక్టర్లు, 49 టిప్పర్లు  పట్టుబడినట్లు తెలి పారు. అలాగే అక్రమ రేషన్‌ బియ్యం కేసులు 77 నమోదు కాగా, వీటి విలువ  రూ.29,56,850గా పేర్కొ న్నారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘన కేసులు 1,09511 నమోదు కాగా,  రూ. 4,38,26,691 జరిమా నాలు విధించినట్లు తెలిపారు. నాలుగు హత్య కేసులు నమోదు కాగా, ఛేదించినట్లు  పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన, పండుగలు, ఇతర కార్యక్రమాల సందర్భంలో జిల్లా పోలీస్‌శాఖ గట్టి నిఘాను ఏర్పాటు చేసి శాంతిభద్రతలకు మొ దటి ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రతీ నెలకు రెండుసార్లు కార్డెన్‌ సెర్చ్‌ కార్యక్రమం చేపట్టి దొంగతనాల నివారణ, సంఘవిద్రోహ శక్తుల నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అమాయక ప్రజలు మోసపోకుండా కళాజాత బృందం ఆధ్వ ర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వ హించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామన్నారు. సిబ్బంది సమష్టి కృషితో గతేడాది కంటే మరింత పురోగతి సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ భరత్‌, డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్‌, శంకర్‌,  జనార్దన్‌, డీసీఆర్‌బీ సీఐ ఇప్తెకార్‌ అహ్మద్‌, ఆర్‌ఐ కృష్ణయ్య ,నారాయణపేట ఎస్‌ఐ సురేష్‌గౌడ్‌, ఎస్‌బీ ఎస్‌ఐ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T04:30:47+05:30 IST