విద్యా సంస్థల మూసివేత సరికాదు

ABN , First Publish Date - 2021-03-25T04:12:46+05:30 IST

కరోనా పేరుతో రాష్ట్రంలో విద్యా సంస్థ లను ప్రభుత్వం మూసివేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరహరి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌లు అన్నారు.

విద్యా సంస్థల మూసివేత సరికాదు

- ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులునారాయణపేట టౌన్‌, మార్చి 24 : కరోనా పేరుతో రాష్ట్రంలో విద్యా సంస్థ లను ప్రభుత్వం మూసివేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరహరి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌లు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన కార్య క్రమం చేపట్టగా, పీడీఎస్‌యూ నాయకులు సమావేశం నిర్వహించి మాట్లాడా రు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించి నెల రోజులు కూడా కాలేదని, మళ్లీ కరోనా పేరుతో మూసివేయడం సరికాదన్నారు. ఈ విషయమై ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా సంస్థ ల మూసివేతపై మాట్లాడారని, మరోవైపు పూర్తిస్థాయిలో తరగతులు జరుగక ఇప్పుడు మళ్లీ విద్యాసంస్థలు మూసివేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించా రు. ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాలు రోడ్డునపడే ప్రమాదముందన్నారు. ఆన్‌ లైన్‌ క్లాసులు అంటూ ప్రభుత్వం మళ్లీ మొదటికి వస్తున్నదని, ఇప్పటికే ఆన్‌లై న్‌ క్లాసులతో పేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు విచ్చలవిడిగా లక్షలా ది రూపాయలు వసూలు చేశాయని వారు గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక బడులను మూసి వేయించడం పూర్తిగా అవకాశ వాదమే అన్నారు. 9వ తరగతి నుంచి పీజీ వరకు విద్యా సంస్థలను ప్రారంభించాలని వారు కో రారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవికిరణ్‌, శశికిరణ్‌, ప్రవీణ్‌, తిరుపతి, అంజీ, పీ డీఎస్‌యూ నాయకులుగౌస్‌, భరత్‌, రఘు,నరేష్‌, స్వాతి, మాధురి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T04:12:46+05:30 IST