బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలి

ABN , First Publish Date - 2021-10-21T05:00:25+05:30 IST

దేశం మొత్తంలో బాలకార్మిక వ్మవస్థను రూపుమా పాలని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ విజయలక్ష్మి అన్నారు.

బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలి
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ విజయలక్ష్మి

 - ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ విజయలక్ష్మి

ఉండవల్లి, అక్టోబరు 20: దేశం మొత్తంలో బాలకార్మిక వ్మవస్థను రూపుమా పాలని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని చిన్నఆముదాలపాడు గ్రామంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ  జాతీ య కార్యదర్శి డాక్టర్‌ విజయలక్ష్మి, సర్పంచు నాగేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాలల్లో ఆక లి, పేదరికం ఉన్న దేశాలల్లో మన దేశం 101 స్థానంలో ఉండడం బాధాకరమని అన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టం చేస్తే బాలకార్మికులు తగ్గిపోతారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువత తప్పటడుగులు వేయరని అన్నారు. పత్తి రైతులను. కూలీలను వ్యవసాయ  కార్మికులుగా గుర్తించాలని అన్నారు. పత్తికి కనీస మద్దతు ధర పదివేలు అమలు చేయాలని అన్నారు. కొవిడ్‌ రాకతో  బాల కార్మికులు నాలుగు రెట్లు ఎక్కువయ్యారని అన్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపు మాపాడానికి అంతర్జాతీయకార్మిక సంస్థ కృషి చేస్తుందని, ఇందుకు ప్రజలు, ప్రభు త్వాలు సహకరించాలని అన్నారు. సర్పంచు నాగేష్‌ మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు సరియైున అవకాశాలు కల్పించి, కార్మికులకు తగిన వేతనాలు అందించే విధంగా ప్రభుత్వ పథకాలు ఉండాలని అన్నారు.   అనంతరం  రైతు సంఘం స భ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఎల్‌వో మండల కో ఆర్డినేటర్‌ వీరాంజనేయులు,  రైతుసంఘం అధ్యక్షుడు నరేందర్‌ రెడ్డి, గ్రామ కో ఆ ర్డినేటర్‌  హుస్సేన్‌, పెద్ద శివుడు, నాగన్న, కృష్ణ, సుందర్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:00:25+05:30 IST