సంపులో పడి బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-02-27T03:50:19+05:30 IST

సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన క ల్వకుర్తి మండల పరిధి లోని తర్నికల్‌ గ్రామం లో చోటుచేసుకుంది.

సంపులో పడి బాలుడి మృతి
మృతి చెందిన అభిలాష్‌

కల్వకుర్తి అర్బన్‌, ఫిబ్రవరి 26: సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన క ల్వకుర్తి మండల పరిధి లోని తర్నికల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తర్నికల్‌ గ్రామానికి చెందిన శ్రీశైలం, సునీత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. తండ్రి శ్రీశైలం మేస్ర్తీ పనికి వెళ్లగా తల్లి సునీత కూలీ పనికి వెళ్లింది. ఇంటి ముందు ఉన్న సంపులో అభిలాష్‌ (3) పడి మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో చుట్టు ప్రక్కల ఉన్న వారు సంపులో చూడగా బాలుడు మృతి చెందినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. Updated Date - 2021-02-27T03:50:19+05:30 IST