అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-03-22T04:01:15+05:30 IST
అదృశ్యమైన వ్యక్తిని హత్యచేసి నారాయ ణపేట మండలం మేకహన్మాన్ తండా సమీపంలో ఖననం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడికావడంతో కొంతమంది అనుమానితు లను పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.

- పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం
లనారాయణపేట క్రైం, మార్చి 20 : అదృశ్యమైన వ్యక్తిని హత్యచేసి నారాయ ణపేట మండలం మేకహన్మాన్ తండా సమీపంలో ఖననం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడికావడంతో కొంతమంది అనుమానితు లను పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. కోయి ల్‌కొండ మండలం గోకుల్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌ను ఉమాపతినాయక్ హత్య చేసి నారాయణపేట మండలం తిర్మలాపూర్ గ్రామ శివారులో పాతి పెట్టారన్న కోణంలో పోలీసులు విచారణ చేసి నారాయణపేట డీఎస్పీ మధు సూదన్‌రావు, సీఐ శ్రీకాంత్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం వెంకటేష్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసుకు సంబం ధించి ఎంతమంది వ్యక్తుల ప్రమేయం ఉంది. హత్యకు గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.