బీజేపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2021-02-07T03:56:57+05:30 IST

అచ్చంపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

బీజేపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేస్తున్న డీకే అరుణ

 - జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

అచ్చంపేట, ఫిబ్రవరి 6: అచ్చంపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శనివారం పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేష న్‌ సహకారంతో తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ప్రైమ్‌ మినిస్టర్‌ కప్‌-2021 క్రికెట్‌ పోటీలను డీకే అరుణ ప్రారంభించారు. 120 మంది  క్రీడాకారులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. భవిష్యత్‌లో అచ్చంపేటలో బీజేపీ తరుపున పోటీ చేయనున్న వారిని గెలిపించు కోవాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్‌  ప్రధాన కార్యదర్శి  గురువారెడ్డి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్య క్షుడు ధర్మానాయక్‌, ఫౌండేషన్‌ నిర్వాహకులు శ్రీకాంత్‌, భీమా తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-02-07T03:56:57+05:30 IST