తెలంగాణ గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండా

ABN , First Publish Date - 2021-12-27T04:32:02+05:30 IST

రానున్న ఎన్నిక ల్లో తెలంగాణ గడ్డ మీద ఎగిరేది కాషయం జెం డా అని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

తెలంగాణ గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండా

రాజాపూర్‌, డిసెంబరు 26 : రానున్న ఎన్నిక ల్లో తెలంగాణ గడ్డ మీద  ఎగిరేది కాషయం జెం డా అని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం మహబూ బ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం ఈద్గాన్‌పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై  విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పర్యటిం చిన ఆయన బీజేపీ జెండాను అవిష్కరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తున్నాడని, వడ్ల విషయం లో సీఎం మతి తప్పి మట్లాడుతున్నాడని అన్నా రు. ఎక్క డైతే ధర్నాలు చేయకూడదని నిషేదం విధించిన కేసీఆర్‌ అక్కడే ఆయన ధర్నాలు చేస్తు న్నాడని అన్నారు. హుజూరాబాద్‌లో తనను ఓడించాలని  రూ. 600 కోట్లు ప్రజల సోమ్మును ఖర్చు చేశాడని, 13 మంది మంత్రులను, వందల సంఖ్యలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు అక్కడకు వచ్చి ప్రచారం చేసినా హుజూరాబాద్‌ ప్రజలు ధర్మానికే పట్టం కట్టారని అన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను ఢీకొనే సత్తా బీజేపీకే ఉందని అన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా అఽధ్యక్షుడు వీరబ్రహ్మచారి, డోకూర్‌ పవన్‌కుమా ర్‌, శ్రీవర్ధన్‌ రెడ్డి, అందే బాబయ్య, వెంకటేశ్వర్‌ రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, నందీశ్వర్‌, తిరుపతి, ఆశోక్‌, నియోజకవర్గ, మండల,  గ్రామస్థాయి నాయకు లు, కార్యక ర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T04:32:02+05:30 IST