బైక్‌ అదుపు తప్పి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-02-07T03:57:41+05:30 IST

బైక్‌ అదుపు తప్పి కిందపడటంతో యువకుడు మృతి చెందాడు.

బైక్‌ అదుపు తప్పి యువకుడి మృతి

పదర, ఫిబ్రవరి 6: బైక్‌ అదుపు తప్పి కిందపడటంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండల కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివ రాల ప్రకారం.. అమ్రాబాద్‌ మండలం కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన గుండాల రాములు, జంగమ్మ దంపతుల రెండవ కుమారుడు రాజు తన స్నేహితుడు సిద్దుతో కలిసి బైక్‌పై పదర కు వెళ్తుండగా నక్కలగుట్ట వద్ద అదుపు తప్పి కిందపడింది. క్షతగాత్రులను కుటుంబ సభ్యు లు హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా రాజు(23)తల నుంచి అధిక రక్తస్రావం కావడం తో మార్గమధ్యలో మైసిగండి వద్ద ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి వివాహమై ఏడాది అవుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.    

Updated Date - 2021-02-07T03:57:41+05:30 IST