ప్రభుత్వ భూముల్లో భారత్‌ మాల రహదారి నిర్మించాలి

ABN , First Publish Date - 2021-12-31T05:35:29+05:30 IST

ప్రభుత్వ భూముల్లో భారత్‌ మాల జాతీయ రహదారిని నిర్మించాలని ఆర్డీవో వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి కోరారు.

ప్రభుత్వ భూముల్లో భారత్‌ మాల రహదారి నిర్మించాలి
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం

మాగనూరు, డిసెంబరు 30 : ప్రభుత్వ భూముల్లో భారత్‌ మాల జాతీయ రహదారిని నిర్మించాలని ఆర్డీవో వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి కోరారు. రహదారి విస్తరణలో భాగంగా గురువారం నల్లగట్టు మారెమ్మ దేవాలయానికి నోటీసులు ఇచ్చారని దేవాలయ కమిటీ, గ్రామస్థుల ద్వారా స మాచారం తెలుసుకుని గురువారం ఆలయానికి చేరుకొని ఆర్డీవో, తహసీల్దార్‌ ను అక్కడికి పిలిపించారు. దేవాలయాన్ని మినహయించి పక్కనున్న ప్రభుత్వ స్థలంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ శ్యామలమ్మ, సర్పంచు రాజు, సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీనివాసులు, అశోక్‌గౌడ్‌, మారెప్ప, సత్యప్ప, వాకిటి వెంకటయ్య, గోవర్దన్‌గౌడ్‌ ఉన్నారు.

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ఇద్దరికి షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచుల పెళ్లికి సీఎం కేసీఆర్‌ లక్షా నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ తిప్పయ్య, తహసీల్దార్‌ తిరుపతయ్య, ఆర్‌ఐ నర్సింహులు, సర్పంచులు మంజుల, రాఘవేంద్ర, టీఆర్‌ఎస్‌ నాయకులు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.


 

Updated Date - 2021-12-31T05:35:29+05:30 IST