అధికారులు నిర్లక్ష్యం వీడాలి

ABN , First Publish Date - 2021-12-08T04:13:57+05:30 IST

అధికారులు నిర్లక్ష్యం వీడి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌ రెడ్డి అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.

అధికారులు నిర్లక్ష్యం వీడాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి

- అధికారులపై ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి ఆగ్రహం 

- వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం

మరికల్‌, డిసెంబరు 7 : అధికారులు నిర్లక్ష్యం వీడి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌ రెడ్డి అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కార్యాలయంలో ఎంపీపీ శ్రీకలరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఎంపీడీవో యశోదమ్మ, తహసీల్దార్‌ శ్రీధర్‌ గత సమావేశంలో చర్చించి తీర్మానం చేసిన పనులు పూర్తి చేయకపోవడంపై మండిపడ్డారు. ఏపీవో చంద్రశేఖర్‌ చేపట్టిన అభివృద్ధి పనులను సరియైున సమాధానం ఇవ్వలేదు. అదే విధంగా మిషన్‌భగీరథ పైపులైన్‌ మరమ్మతు విషయంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తడి, పొడి చెత్తపై, వివిధ శాఖలోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చిన సభ్యులకు సంబంధిత అఽఽధికారులు సమాధానం చెప్పలేక పోవడంతో వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికి అఽధికారులు పూర్తి స్థాయిలో నివేధికలు త యారు చేసుకొని సమావేశానికి హాజరుకావాలన్నారు. అంతకుముందు 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, 9 మందికి రూ.3.72 లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ సురేఖ రెడ్డి, ఎంపీపీ శ్రీకళరెడ్డి, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, తీలేరు సింగిల్‌ విండో అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్‌, రైతు సమితి అధ్యక్షుడు సంపత్‌ కుమార్‌, కోఅప్షన్‌ మెంబర్‌ మతీన్‌, హన్మిరెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.  Updated Date - 2021-12-08T04:13:57+05:30 IST