తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి

ABN , First Publish Date - 2021-09-18T04:44:58+05:30 IST

తెలంగాణ విమోచ నదినమైన సెప్టెంబరు 17ను ప్రభుత్వమే అఽధికా రికంగా నిర్వహించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చా లని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి కోరా రు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి
పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి

- విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి 


మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌)/గండీడ్‌, హన్వా డ/ భూత్పూర్‌/ దేవకరద్ర/ మూసాపేట/ అడ్డా కుల/ చిన్నచింతకుంట/ బాలానగర్‌/ రాజాపూ ర్‌/ జడ్చర్ల, సెప్టెంబరు 17 : తెలంగాణ విమోచ నదినమైన సెప్టెంబరు 17ను ప్రభుత్వమే అఽధికా రికంగా నిర్వహించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చా లని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి కోరా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్న క్రమంలో ఎన్నో సార్లు తెలంగాణ విమోచన దినాన్ని సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిం చాలని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ విమోచనా దినోత్సవం సెప్టెంబరు 17ను పురస్కరించుకొని శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారత దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు మాత్రం అప్పటి హోం మంత్రి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చొరవతో నిజాం నిరంకుశ పాలనలో మగ్గు తున్న హైదరాబాద్‌ సంస్థానానికి 1948 సెప్టెంబ ర్‌ 17నవిముక్తి పొందిందని తెలిపారు. కార్యక్ర మంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, పడా కుల బాలరాజు, సీనియర్‌ నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, పడాకుల రామచంద్రయ్య, అం జయ్య, పట్టణ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, రామేశ్వ రి, కొండయ్య, కృష్ణయ్య, పద్మవేణి, మధుసూదన్‌ రెడ్డి, నాగరాజు, సుబ్రమణ్యం, అవినాష్‌ పాల్గొన్నా రు. హన్వాడ, దేవరకద్ర, అడ్డాకుల, జడ్చర్ల మండ లాల్లో తహసీల్దార్‌ కార్యాలయాలపై జాతీయ జెం డాను అక్కడి బీజేపీ నాయకులు ఎగురవేశారు. చిన్నచింతకుంట మండలం అప్పంపల్లి అమరవీ రుల స్థూపం వద్ద గ్రామస్థులు. పెద్దలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరులకు నివాళ్లర్పించారు. గండీడ్‌, హన్వాడ, భూత్పూర్‌, దేవకరద్ర, మూసాపేట, అడ్డాకుల, చిన్నచింతకుంట, బాలానగర్‌, రాజాపూర్‌, జడ్చర్ల తదితర మండలాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T04:44:58+05:30 IST