ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-01-21T03:58:23+05:30 IST
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులకు రక్తపు గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు.

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన డీసీఎం
డ్రైవరు, 50 గొర్రెలు మృతి 8 పలువురికి గాయాలు
గోపాల్‌పేట, జనవరి 20 : వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులకు రక్తపు గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివ రాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వనపర్తి నుంచి నాగర్‌కర్నూల్ వెళుతోంది. అదే సమయంలో వనపర్తికి చెందిన డీసీఎం వాహనం 120 గొర్రెలను తీసుకొని బిజినేపల్లి నుంచి కర్నూల్‌కు వెళుతూ బుద్దారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఆ చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వనపర్తికి చెందిన డీసీఎం డ్రైవర్ ఆసీఫ్(30) తీవ్రంగా గాయపడి హైదరా బాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డీసీఎంలో ఉన్న 50 గొర్రెలు వృతి చెందగా మరి కొన్ని గొర్రెలు తీవ్ర గాయాలపాల య్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని గాయాల పాలైన ప్రయాణికులను రెండు ఆంబులెన్స్‌లలో వనపర్తి ఆసు పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ గోపాల్‌రెడ్డి వెల్లడించారు.

