తెలంగాణ తల్లి సోనియాగాంధీ
ABN , First Publish Date - 2021-12-10T04:13:48+05:30 IST
తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.

- ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి
- ఘనంగా జన్మదిన వేడుకలు
- జిల్లాలో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభం
వనపర్తి టౌన్, డిసెంబరు 9 : తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేం ద్రంలోని రాజీవ్‌చౌరస్తాలో సోనియాగాంధీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండా ఎగురవేసి, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదును ప్రా రంభించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లా డుతూ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన సోని యాగాంధీ నూరేళ్లు జన్మదినాన్ని ఆరోగ్యంగా జరుపు కోవాలని ఆకాంక్షించారు. అనంతరం భారతదేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషించిన బిపిన్ రావత్ తో పాటు, మృతి చెందిన వారికి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శంకర్ ప్రసాద్, తిరుపతయ్య, కిరణ్‌కుమార్, కోట్లరవి, ముని సిపల్ ఫ్లోర్‌లీడర్ బండారు రాధాకృష్ణ, బ్రహ్మం, ఎండీ.బాబా, మెంటపల్లి రాములు, డి.వెంకటేష్, ద్వారపోగు విజయ్‌బాబు, మన్నెంకొండ, నాగార్జున, గంధం లక్ష్మయ్య, గోర్ల జాన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తాం
కొత్తకోట : కార్యకర్తల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెస్తామని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని జమా మస్జిద్ ఏరియాలో పార్టీ డిజి టల్ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో 5వేల మందికి సభ్యత్వాలు ఇచ్చినట్లు ప్రశాంత్ తెలి పారు. సభ్యత్వంతో పాటు, రూ.2లక్షల బీమా చేయ డం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు గొల్లబాబు, బోయోజ్, కృష్ణారెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, నరేందర్‌రెడ్డి, శివరాములు, సలీంఖాన్, ముజీబ్, వెంకటేష్, రాములుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పండ్లు పంపిణీ
శ్రీరంగాపూర్ : సోనియాగాంధీ జన్మదిన వేడుక లను శ్రీరంగాపూర్‌లో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యా ర్థులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పం డ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల యువ జన కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, మీడియా కన్వీ నర్ పురుషోత్తంయాదవ్, గ్రామ అధ్యక్షుడు గోవింద్, అరవింద్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆశన్న, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు
ఆత్మకూర్ : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆత్మకూర్‌లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి గంగాధర్‌గౌడ్ ఆధ్వర్యంలో మండల, పట్టణ అధ్యక్షులు పరమేష్, శ్రీనివాసులు గురువారం ప్రారంభించారు. అనంతరం సోనియాగాంధీ జన్మ దినాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గణేష్, వెంకటన్న, షబ్బీర్, సలీం, జఫార్, గంగాధర్, బుచ్చన్న, శ్రీను, చెన్నయ్య తది తరులున్నారు.
పెబ్బేరులో...
పెబ్బేరు : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదే శాల మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను పెబ్బేరు మండల కేంద్రంలో ప్రారంభించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద భీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయవర్ధన్‌రెడ్డి, జిల్లా యూత్ నాయకులు రంజిత్‌కుమార్, బీసీ సెల్, మైనార్టీ నాయకులు రాములుయాదవ్, షకీల్, ఆనం ద్, సాగర్, బషీరుద్దీన్, జగదీశ్వర్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి, సాయిగౌడ్, భానుప్రకాష్, హేమంత్‌కుమార్‌రెడ్డి, సు నీల్‌కుమార్, భరత్‌రావు, సాదిక్, జహంగీర్, అంజి, ఖాసీం, జయరాజ్ తదితరులున్నారు.