పారిశుధ్య పనులు చేస్తూ ఉపాధ్యాయుల నిరసన

ABN , First Publish Date - 2021-10-26T04:47:14+05:30 IST

పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని కోరుతూ సోమవారం టీపీయూఎస్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.

పారిశుధ్య పనులు చేస్తూ ఉపాధ్యాయుల నిరసన
పెద్దపొర్ల పాఠశాలలో పారిశుధ్య పనులు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

నారాయణపేట రూరల్‌, అక్టోబరు 25 : పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని కోరుతూ సోమవారం టీపీయూఎస్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులే పారిశుధ్య కార్మి కులుగా పని చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శేర్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

మక్తల్‌ : పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని సోమవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవాధ్యక్షుడు నర్సిములు, మండలాధ్యక్షుడు భీంరెడ్డి మాట్లాడుతూ స్కావెంజర్లు లేకపోవడంతో పాఠశాలల్లో చెత్త, చెదారం పేరుకుపోయిందన్నారు. కార్యక్రమంలో తపస్‌ మండల ప్రధాన కార్యదర్శి రవీందర్‌, ఉపాధ్యాయులు ముకుందా చారీ, రాముగౌడ్‌, రాకేష్‌, గోపాల్‌, శ్రీనివాస్‌, జగదీష్‌, రాములు, నర్సిరెడ్డి, రామాంజనేయులు, శివజ్యోతి, మౌనిక పాల్గొన్నారు. 

ధన్వాడ : ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలని సోమవారం ధన్వాడలో తపస్‌ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయులే పాఠశాలలో తరగతి గదులను ఊడ్చారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రాంగోపాల్‌నాయక్‌, మండలాద్యక్షుడు సురేష్‌కుమార్‌, విశ్వనాథంగౌడ్‌, శేఖర్‌గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, రవి కిరణ్‌, మాణిక్యప్ప పాల్గొన్నారు.

మాగనూర్‌ : పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని టీపీయూఎస్‌ మండల అధ్యక్షుడు నరసింహులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సోమవారం తహసీల్దార్‌ తిరుపతయ్యకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రామ్మోహన్‌, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి వసంత కుమార్‌ పాల్గొన్నారు.

ఊట్కూర్‌ : పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నిమించాలని తపస్‌ ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు మండలంలోని బిజ్వార్‌, అవుసులోన్‌పల్లి, పెద్దపొర్ల, మల్లెపల్లి, ఊట్కూర్‌ పాఠశాలల్లో సోమవారం ఉపాధ్యాయులు పారిశు ధ్య పనులు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహా, మండలాధ్యక్షుడు రవికుమార్‌, గౌరవాధ్యక్షుడు నర్సింగప్ప, ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లను నియమించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, నర్సిములు, పీడీ వెంకట్రాములు, బన్నేష్‌, ధనుంజయ్‌, పురుషోత్తం, అంబర్నాథ్‌, మెహన్‌రావు, వెంకటేష్‌, భాస్కర్‌, రాంప్రసాద్‌, గోపాల్‌, రమేష్‌, రవి, బాలమురళి, విజయలక్ష్మీ, వెంకటేశ్వరమ్మ, రమాదేవి, జయశ్రీ పాల్గొన్నారు.

నారాయణపేట టౌన్‌ : దామరగిద్ద మండల కేంద్రంలోని హైస్కూల్‌తో పాటు మండలంలోని పాఠశాలల్లో పారిశుద్య కార్మికులను నియమిం చాలని తెలంగాణ ప్రాంత తసస్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రంలోని హైస్కూల్‌తో పాటు మండలంలో ఆయా పాఠశా లల్లో తపస్‌ ఉపాధ్యాయ సంఘం మండల శా ఆధ్వర్యంలో పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో తపస్‌ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ ఉపాధ్యాయులు సత్య నారాయణ, పద్మావతి, గీత, సౌజన్య, జ్యోతి, గుర్ననాథ్‌రెడ్డి పాల్గొన్నారు.Updated Date - 2021-10-26T04:47:14+05:30 IST