బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-11-10T04:33:13+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్న సోషల్‌ సెక్యురిటీ స్కీం మెగా కంపైన్‌ (ప్రభుత్వ బీమా పథకాలను)లో ప్రతీ ఒక్కరు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి కోరారు.

బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి

అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి

నారాయణపేట టౌన్‌, నవంబరు 9 : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్న సోషల్‌ సెక్యురిటీ స్కీం మెగా కంపైన్‌ (ప్రభుత్వ బీమా పథకాలను)లో ప్రతీ ఒక్కరు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పుర కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా సెక్యూరిటీ స్కీం క్యాంప్‌ను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ స్కీంలో ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన వివిధ స్కీంల ద్వారా ఏడాదికి 330/ 12/ సుకన్య సంవృద్ధి యోజన (12 ఏళ్లలోపు బాలికలకు) ఈ స్కీంలో చేరేలా చూడాలని కోరారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి ఈ మేళా నిర్వహిస్తామని, జిల్లా ప్రజలు పాల్గొని స్కీంలో చేరాలని సూచించారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ప్రసన్న కుమార్‌, అధికారులు కృష్ణ మాచారీ, రాం మనోహార్‌ రావు, మురళి, వేణుగోపాల్‌, సిద్రామప్ప, కమిషనర్లు భాస్కర్‌రెడ్డి, మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T04:33:13+05:30 IST