పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ

ABN , First Publish Date - 2021-06-06T04:44:58+05:30 IST

పర్యావరణాన్ని పరిరక్షించు కుంటేనే మనుగడ సాగుతుందని యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి అన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల బొటానికల్‌ గార్డెన్‌లో మొక్కలు నాటుతున్న గార్డెన్‌ సమన్వయకర్త, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సదాశివయ్య

- జాతీయ వెబినార్‌లో వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి 

జడ్చర్ల, జూన్‌ 5 : పర్యావరణాన్ని పరిరక్షించు కుంటేనే మనుగడ సాగుతుందని యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి అన్నారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్రం, మైక్రో బయాలజీ, ఎన్‌ఎస్‌ఎస్‌ 2, 3వ యూనిట్‌లు, అసోసియేషన్‌ ఫర్‌ బయో డైవర్సిటీ కన్సర్వేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంయు క్త ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జాతీయ వెబినార్‌ నిర్వ హించారు. ఈ వెబినార్‌లో పాల్గొన్న ప్రొఫెసర్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావర ణాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక దినాలు, అవగా హన కార్యక్రమాలు ఎంతైనా అవసరమని అన్నా రు. పర్వత శిఖరాల నుంచి సముద్రగర్భం వరకు పర్యావరణాన్ని మానవుడు నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు కనుమలలో 44శాతం ఉన్న అడవులు నేడు 27శాతానికి తగ్గిపో యాయని, మరో 10శాతం అడవులు పంటపొ లాలుగా మార్చబడ్డాయని వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీకళాశాలలోని బొటానికల్‌ గార్డెన్‌లో వృక్షశాస్త్ర అధ్యాపకులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సదాశివయ్య ఆధ్వర్యంలో మొక్క లు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్‌ అప్పియ చిన్నమ్మ, అధ్యాపకులు రవీందర్‌ రావు, వెబినార్‌ సమన్వయకర్త శ్రీనివాసులు, లత, సుభాషిణి, నిర్మలాబాబురావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-06T04:44:58+05:30 IST