పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సర్వే
ABN , First Publish Date - 2021-03-22T04:00:22+05:30 IST
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సోమవారం సర్వే నిర్వహించనున్నారు.

- హెచ్‌ఎంల సమావేశంలో డీఈవో రవీందర్
నారాయణపేట, మార్చి 21 : రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సోమవారం సర్వే నిర్వహించనున్నారు. సర్వేకు సంబంధించి కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఐఎస్, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో డీఈఓ రవీందర్ ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఈడీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 82 ఉన్నత, 337 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 11 కేజీబీవీ, 6 రెసిడెన్షియల్, 2 మోడల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. వీటిలో కావాల్సిన మౌలిక సదుపాయలకు సంబంధించి వివరాలను ఎంఈవో సహరంతో 51 కాలమన్ ఫార్మేట్‌లో నమోదు చేసి జిల్లా విద్యాశాఖ అధికారికి రెండ్రోజుల్లో అందించాలని డీఈవో తెలిపారు. సమావేశంలో ఎంఐవో రాజేందర్, సెక్టోరల్ అధికారి విద్యాసాగర్, శ్రీనివాస్, ఎంఈవోలు వెంకటయ్య, గోపాల్ నాయక్, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.