అఖండ భారత్‌కు వందేమాతరం ఫౌండేషన్ విద్యార్థుల దీపాంజలి

ABN , First Publish Date - 2021-08-15T07:23:34+05:30 IST

దేశ స్వాతంత్ర్య దినోత్సవ నేపథ్యంలో వందేమాతరం ఫౌండేషన్ ‘కలాం-100 విద్యార్థులు’ అఖండ భారత్‌కు దీపాంజలి ..

అఖండ భారత్‌కు వందేమాతరం ఫౌండేషన్ విద్యార్థుల దీపాంజలి

మహబూబాబాద్: దేశ స్వాతంత్ర్య దినోత్సవ నేపథ్యంలో వందేమాతరం ఫౌండేషన్ ‘కలాం-100 విద్యార్థులు’ అఖండ భారత్‌కు దీపాంజలి ఘటించారు. మహబూబాబాద్ లోని తొర్రూర్‌లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం స్ఫూర్తితో నిరుపేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించడం జరుగుతోందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెల్లడించారు. కలాం 100 పేరుతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, అందులో 100 మంది నిరుపేద విద్యార్థులను ఎంపిక చేసి.. వారికి ప్రభుత్వ పాఠశాలల్లోనే శాస్త్ర, సాంకేతిక విద్యలో నైపుణ్యం అందించడం జరుగుతుందని చెప్పారు. తమ వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండేళ్లుగా ఈ కలాం-100 కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నైతికతతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవ నేపథ్యంలో ‘కలాం 100’ విద్యార్థులు ఈ విధంగా వినూత్నంగా అఖండ భారత్‌ చిత్రాన్ని దీపాలు, పుష్పాలతో చిత్రించి దీపాంజలి ఘటించారు.



Updated Date - 2021-08-15T07:23:34+05:30 IST