చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-05-21T05:16:14+05:30 IST
చట్టాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు పోలీస్ అధికారులను ఆదేశిం చారు.

- శాంతి సమీక్షలో ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు
మహబూబ్‌నగర్, మే 20 : చట్టాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు పోలీస్ అధికారులను ఆదేశిం చారు. గురువారం ఎస్పీతన కార్యాలయంలో పోలీసులతో శాంతి సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతాయు తంగా ఉండే ప్రజలే పోలీసులకు అసలైన స్నేహితులని అన్నారు. ఇటీవల జరిగిన నేరాల గురించి ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ల వారీగా నేరాల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. పాత నేరాల దర్యాప్తులో పురోగతి సాధించేందుకు ప్రతీఒక్కరు ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు కరోనా వాక్సిన్ వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పీ (అడ్మిన్) వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీధర్, వివిధ పోలీస్ స్టేషన్‌ల ఇన్‌ప్పెక్టర్లు పాల్గొన్నారు.
లాక్‌డౌన్‌ను పరిశీలించిన ఎస్పీ
పట్టణంలో అమలవుతున్న లాక్‌డౌన్ తీరును ఎస్పీ పరిశీలించారు. గురువా రం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి వ్యాపారులు, ప్రజల తో మాట్లాడారు. రోడ్లపై తిరుగుతున్న వారిని ఆపి మాట్లాడారు. దుకాణాల ముందు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్ మొ దలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4742 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.