గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

ABN , First Publish Date - 2021-12-09T04:29:54+05:30 IST

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కులవృత్తులను ప్రొత్సహిస్తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
గొర్రెలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి


వీపనగండ్ల, డిసెంబరు 8 : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కులవృత్తులను ప్రొత్సహిస్తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. బుధ వారం చిన్నంబావి మండలంలోని దగడపల్లిలో సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మండలానికి 44 యూనిట్లు మంజూరైనట్లు పశుసంవర్థక శాఖ అధికారి విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గొల్ల కురుమలు ఆర్థి కంగా ఎదగాలనే ఉద్ధేశంతో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టార న్నారు. ప్రజా అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. రైతులు వరి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు. కార్య క్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పీటీసీ వెంకటరామమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు చిన్నారెడ్డి, ఈదన్నయాదవ్‌ తదితరులున్నారు.


Updated Date - 2021-12-09T04:29:54+05:30 IST