‘విద్యాభ్యాసం జరిగేలా చర్యలు చేపట్టాలి’
ABN , First Publish Date - 2021-01-13T03:16:29+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో 9వ తరగతి నుంచి ఆ పైన అన్ని తరగతి గదుల వి ద్యాభ్యాసం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ అధికారులను ఆదేశించారు.

నాగర్‌కర్నూల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో 9వ తరగతి నుంచి ఆ పైన అన్ని తరగతి గదుల వి ద్యాభ్యాసం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా అభివృద్ధి, సంక్షేమ అధికారులతో తరగతుల పునఃప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను సందర్శించి ఎక్కడైనా రిపేర్లుంటే వెంటనే చేపట్టాలన్నారు. ఈ నెల 25వ తేదీ లోగా తరగతులు ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేసినట్లు లిఖిత పూర్వక నివేదిక ఇవ్వాలని తెలియజేశారు. వసతి గృహాల్లో ఇప్పటికే నిల్వ ఉన్న బియ్యం, పప్పు దినుసులు మొదలగునవి పాడైపోయి ఉంటాయని, వాటిని వాడకుండా కొత్తగా సరుకులు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత అధికారులు అన్ని పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, రెసిడె న్షియల్ కళాశాలను సందర్శించి నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అదనపు కలెక్టర్ మనూ చౌదరి, ట్రైనీ కలెక్టర్ చిత్రమిశ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా సంక్షేమ అధికారి ప్రజ్వల, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అశోక్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్‌రెడ్డి, జిల్లా బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అనిల్‌ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.