పోరాడితేనే రాజ్యాధికారం
ABN , First Publish Date - 2021-10-21T05:22:54+05:30 IST
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయంగా, విద్యా పరంగా అన్యాయం జరుగుతోందని జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు.

- జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్
బాదేపల్లి, అక్టోబరు 20 : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయంగా, విద్యా పరంగా అన్యాయం జరుగుతోందని జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని గంగాపూర్ గ్రామంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘ నంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ బీసీ నాయకులు ఎడ్ల బాలవర్ద న్‌గౌడ్ చేపడుతున్న బీసీ చైతన్య యాత్రను విజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో 60శాతం ఉన్న బీసీలంతా ఏకమై అన్ని పార్టీలకు సహాయ నిరాకరణ చేస్తే రాజ్యాధికారం వస్తుందని అన్నారు. 75 సంవత్సరాలు దాటినా నేటికీ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడటమే మిగిలిందన్నారు. ఈ యాత్ర ద్వారా అణగారిన కులాలను చైతన్య పరచి రాజ్యాధికార సాధనలో భాగస్వాములను చేయాలనే తలంపుతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్ద న్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బీసీ నాయకులు రాచాల యుగంధర్‌గౌడ్, కృష్ణ యాదవ్, నడి మింటి శ్రీను, ఎమ్మార్పీఎస్ నాయకులు దగ్గుల బాలరాజు, భీమ్‌రాజ్, కృష్ణ, సత్యయ్య, కృష్ణయ్య, రాఘవేందర్, గోపాల్ యాదవ్, వినోద్ పాల్గొన్నారు.