పరిహారం కోసం పడిగాపులు

ABN , First Publish Date - 2021-08-22T04:31:54+05:30 IST

నాగరకర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలో డిండి ఎత్తిపోతల (డీఎల్‌ఐ) కోసం భూములు ఇచ్చిన రైతులకు నేటికీ పరిహారం ఇవ్వలేదు. కాల్వల నిర్మాణం కోసం 2017లోనే భూములు సేకరించి, పనులు ప్రారంభించారు.

పరిహారం కోసం పడిగాపులు
వంగూరు మండలంలో తవ్విన డీఎల్‌ఐ కాల్వ

నాలుగేళ్లైనా అందని డబ్బులు 8 డీఎల్‌ఐ నిర్వాసితుల ఆవేదన

ఎకరానికి ప్రభుత్వం ఇస్తామన్నది రూ.5.50 లక్షలు.. 8 రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌


 వంగూరు, ఆగస్టు 21: నాగరకర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలో డిండి ఎత్తిపోతల (డీఎల్‌ఐ) కోసం భూములు ఇచ్చిన రైతులకు నేటికీ పరిహారం ఇవ్వలేదు. కాల్వల నిర్మాణం కోసం 2017లోనే భూములు సేకరించి, పనులు ప్రారంభించారు. ఎకరానికి రూ.5.50 లక్షలు పరిహారం చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. నాలుగేళ్లు గడిచినా డబ్బులు మాత్రం అంద లేదని బాధితులు వాపోతున్నారు.


ఆందోళనలో రైతులు

ఓ వైపు సాగు భూములు కోల్పోయి, మరో వైపు పరిహారం అందక రైతు కుటుంబాలు ఆగమవుతున్నాయి. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2 వేల మంది రైతులు డీఎల్‌ఐ కోసం భూములను కోల్పోయారు. 3,678 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, 2,470 ఎకరాలను ఇప్పటి వరకు సేకరించారు. అందులో 707 ఎకరాలకు రూ.38.94 కోట్లు చెల్లించారు. మరో 1,285 ఎకరాలకు రూ.72 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. మరోవైపు నాలుగేళ్లుగా ఆ భూములపై రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయారు. సేకరించిన భూముల్లో కాల్వలు తవ్వి వదిలేయగా, నాలుగేళ్లుగా ఒక్క ఎకరాకూ నీరివ్వ లేదు.


ఎకరానికి రూ.25 లక్షలు చెల్లించాలి

భూమలను సేకరించి నాలు గేళ్లు కావొస్తుం ది. ఇప్పటి వరకు పరిహారం అంద లేదు. ఇప్పుడిచ్చి న పరిహారం తో ఇంకో చోట భూములు కొనే పరిస్థితి లేదు. భూములను కోల్పోయి కూలీలుగా మారాం. ప్రభుత్వం ఎకరానికి రూ.25 లక్షల చొప్పున చెల్లించాలి.

- పర్వతాలు, రైతు, డిండిచింతపల్లి


డిమాండ్‌ మేరకు చెల్లించాలి 

నా భూమి 22 ఎకరాలు డీఎల్‌ఐ కా ల్వలో పోయింది. ఎక రాకు రూ.5.50 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. నాలుగేళ్లు అయినా పరి హారం అందలేదు. ప్రభు త్వం ఇచ్చే పరిహారానికి ఇప్పుడు కుంట భూమి కూడా రాదు. ఇప్పుడు ఎకరం భూమి ధర ఈ ప్రాంతంలో రూ.40 లక్షల నుంచి రూ.50  లక్షలు ఉంది. మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారమే పరిహారం చెల్లించాలి.

- పండిత్‌రావు, సర్వారెడ్డిపల్లి                                                                                                                        

పరిహారం తప్పకుండా చెల్లిస్తాం

డీఎల్‌ఐలో భూములు కోల్పోయిన రైతుల పరి హారం మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిం చాం. పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటాం. భూ నిర్వాసితుల పరిస్థి తులను కలెక్టర్‌కు నివేదిం చాం. రైతులు ఎలాంటి అపోహలకు గురి కావొద్దు. పరిహారం తప్పకుండా వస్తుంది.

- రాజే్‌షకుమార్‌, ఆర్డీఓ, కల్వకుర్తి

Updated Date - 2021-08-22T04:31:54+05:30 IST