భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు
ABN , First Publish Date - 2021-04-22T03:59:09+05:30 IST
మండలంలో శ్రీరామనవమి వేడు కలను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు
తీర్థప్రసాదాలను అందించిన అర్చకులు
ముత్యాల తలంబ్రాలు పంపించిన కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు
భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు
ఉత్సవ విగ్రహాల ఊరేగింపు
కొత్తకోట, ఏప్రిల్ 21: మండలంలో శ్రీరామనవమి వేడు కలను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండు తులు దేవాలయాల్లో రాములోరి కల్యాణాన్ని జరిపించారు. కొత్తకోటలోని కోట్ల ఆంజనేయస్వామి, పామాపురం అభ యాంజనేయస్వామి, మిరాసిపల్లి, అమడబాకుల, కనిమెట్ట, సంకిరెడ్డిపల్లి, రాయనిపేట, విలియంకొండ, వడ్డెవాట, పా లెం, నిర్వేన్ గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. కోట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యేలు సీతాదయాకర్‌రెడ్డి దంపతుల ఇంటి నుంచి సుధామధు సూదన్‌రెడ్డి తెచ్చిన ముత్యాల తలంబ్రాలతో కల్యాణం కొనసాగింది. ఆయా దేవాలయాల్లో అన్నదానం చేశారు.
ఘనంగా శ్రీరామనవమి
వనపర్తి రూరల్: వనపర్తి మండలంలోని పెద్దగూడెం, కడుకుంట్ల, చిట్యాల, అంకూర్ గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భ క్తులు అధికసంఖ్యలో పాల్గొని కరోనా నిబంధనలు పా టిస్తూ పూజలు చేశారు. వనపర్తి కేంద్రంలోని శ్రీ సరస్వ తీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో ప్రధానాచార్యులు ఆ ధ్వర్యంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యా పీఠం ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా విధానం పుస్తకం ఆవిష్కరించారు.
ఆత్మకూరు: సీతారాముల కల్యాణాన్ని భక్తులు ఘ నంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ని ర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి స మర్పించిన ముత్యాల తలంబ్రాలు ఆ పార్టీ మండల అధ్య క్షుడు బాలకృష్ణారెడ్డి రామాలయం, వెకంకటేశ్వర స్వామి ఆలయం, మేడపల్లి ఆంజనేయస్వామి ఆలయాల్లో అందిం చారు. పట్టణంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరిగే కల్యాణ వేడుకలకు మునిసిపల్ చైర్ పర్సన్ గాయత్రి, వైస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌లు హాజరయ్యా రు. మూలమల్ల గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం లో కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.
అమరచింత : స్థానిక రామాలయంలో సీతారామ కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి సమర్పించిన ముత్యాల తలంబ్రాలు ఆ పార్టీ మండల అధ్యక్షుడు మోదీ మనోహర్ రాజు ఊరేగింపు చేస్తూ తలంబ్రాలను సమర్పించారు. క ల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ఉత్స వాన్ని తిలకించారు.
పెద్దమందడి: మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రీరా మనవమి ఘనంగా జరుపుకున్నారు. పెద్దమందడిలోని ఆంజనేయ ఆలయంలో కల్యాణం నిర్వహించారు.
శ్రీరంగాపురం: పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో గ్రామగ్రామాన సీతారాముల కల్యాణం వైభవంగా జరి పారు. శ్రీరంగాపురంలో రంగనాయక స్వామి ఆలయంతో పాటు హనుమాన్ ఆలయంలో నాగరాల, వెంకటాపురం, కంభళాపురం, తాటిపాముల, నాగసానిపల్లి గ్రామాల్లో ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిపారు. పెబ్బేరు మండలంలో వేదమంత్రోచ్ఛ రణలో సూగూరు, కంచిరావుపల్లి, యాపర్ల, గుమ్మడం, తిప్పాయిపల్లి, పాతపల్లి, బున్యాదిపురం, రంగా పురం, శాఖాపూర్ గ్రామాల్లో ఉత్సవాలు జరిగాయి.
పాన్‌గల్: మండలంలో శ్రీరామనవమి వేడుకలను బుధవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రాయనిపల్లి గ్రామంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు తిలకించారు. మహోత్సవానికి హాజరైన భక్తులకు పూజారులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
రేవల్లి: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే స్నానమచారించి దేవాలయాలకు చే రుకొని ప్రత్యేక పూజలు చేశారు.
చిన్నంబావి: మండలంలోని బెక్కెం గ్రామంలో సీతా రాముల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. విద్యాసం స్థల అధినేత ధారాసింగ్ దంపతులు కలాణ వేడుకల్లో పాల్గొని కల్యాణం జరిపించారు. అనంతరం తన సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పెబ్బేరు: పట్టణంలోని హైస్కూల్ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సీతారాముల విగ్రహాలకు అర్చకులు కల్యాణం జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. 12వ వార్డు కౌన్సి లర్ సుమతి ఎల్లయ్య, బలరాంనాయుడు, రాజు ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో..
వనపర్తి రాజీవ్‌చౌరస్తా: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో బుధవారం సీతారాముల కల్యాణం ఘనంగా జరిపించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కల్యాణాన్ని తిలకించడానికి భక్తులకు అనుమతించారు. వేంకటేశ్వర స్వామి ఆల యంతో పాటు రామాలయం, మర్రికుంట, బాలానగర్ అ భయాంజనేయస్వామి దేవాలయాలు, రాంనగర్ రామా లయం, పీర్లగుట్ట ప్రసన్న పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం, విశ్వక్సేన గోశాలలో రాములోరి కల్యాణోత్స వాలను కన్నుల పండువగా జరిపించారు. ఈ సందర్బంగా ఆర్సీ డెవలపర్స్ ఆద్వర్యంలో రమేష్‌చంద్ర, మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పూజ వెంకటేశ్వర్ రెడ్డి, ఉంగ్లం తిరుమల్ పట్టణంలోని ఆయా ఆలయాలతో పాటు గోపాల్‌పేట కోదండ రామస్వామి, జగత్‌పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ముత్యాల తలంబ్రాలు అందించారు. వేం కటేశ్వర దేవస్థానంలో ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథాచార్యుల ఆద్వర్యంలో అర్చకులు ప్రవీణ్‌కుమార్, గురు ప్రసాదాచార్యులు కల్యాణం జరిపించారు. సాయి నగర్ కాలనీలోని రామాలయంలో భౌతికదూరం పాటిస్తూ కల్యాణోత్సవం జరిపించారు. డీఎస్పీ కిరణ్‌కుమార్ కల్యాణం తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. గోశాలలో సౌమిత్రి రామాచార్యుల ఆధ్వర్యంలో 160 గోవుల మధ్య సీతారాముల కళ్యాణం జరిపించి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గోపాల్‌పేట జడ్పీటీసీ సభ్యురాలు మంద భార్గవి, కోటేశ్వర్‌రెడ్డి, జగత్‌పల్లి సర్పంచ్ మధుకుమార్, ఆవుల రమేష్, వినోద్ గౌడు, విశ్వనాథం పాల్గొన్నారు.
గోపాల్‌పేట: మండల కేంద్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుదవారం రాములోరి కల్యా ణం వైభవంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడి, ముత్యాల తలంబ్రాలను పంపిం చగా సీతారాముల వారికి సమర్పించారు. పట్టువస్రాలు, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా వేద పండితులు జరిపించారు.









