ఆరు వేల మొక్కలు నాటడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-09T04:47:31+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్ల ఆవరణలో ఆరువేల మొక్కలు నాటడ మే లక్ష్యమని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.

ఆరు వేల మొక్కలు నాటడమే లక్ష్యం
గద్వాల పోలీస్‌ స్టేషన్లో మొక్క నాటి నీరు పోస్తున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, జూన్‌ 8 : జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్ల ఆవరణలో ఆరువేల మొక్కలు నాటడ మే లక్ష్యమని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. గద్వాల పట్టణ పోలీస్టేషన్‌లో గురువారం నిర్వహిం చిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందన్నారు. రానున్న బక్రీద్‌, బోనాల పండుగల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, సీఐ జక్కుల హనుమంతు, ఎస్‌బీ సీఐ సూర్యానాయక్‌, డీసీఆర్‌బీ ఇన్‌ స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, పట్టణ ఎస్‌ఐలు హరిప్రసాద్‌రెడ్డి, రమాదేవి పాల్గొన్నారు. 


ట్రాఫిక్‌ రూల్స్‌ పకడ్బందీగా అమలు

ట్రాఫిక్‌ రూల్స్‌ పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐకి సూచించారు. పట్టణంలోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లు వాహనాలు నడుపొద్దని చెప్పారు. మద్యం తాగి, హెల్మెట్‌ లేకుండా, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగిన వారి కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్లో మోడల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు.

Updated Date - 2021-07-09T04:47:31+05:30 IST