జోగుళాంబ సన్నిధిలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మేనేజర్‌

ABN , First Publish Date - 2021-08-22T04:14:58+05:30 IST

అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ దేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆల యాలను శనివారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, హైదరాబాద్‌ డివి జనల్‌ రైల్వే మేనేజర్‌ శరత్‌సుధాకర్‌ చంద్రయాన్‌ దర్శించు కున్నారు.

జోగుళాంబ సన్నిధిలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మేనేజర్‌
సౌత్‌సెంట్రల్‌ రైల్వే మేనేజర్‌కు స్వాగతం పలుకుతున్న ఆలయ సిబ్బంది, అర్చకులు

- జోగుళాంబ రైల్వేహోల్ట్‌లో సమస్యలపై వినతి పత్రం అందజేసిన ఈవో

అలంపూరు, ఆగస్టు 21 : అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన  జోగుళాంబ దేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆల యాలను శనివారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే,  హైదరాబాద్‌ డివి జనల్‌ రైల్వే మేనేజర్‌ శరత్‌సుధాకర్‌ చంద్రయాన్‌ దర్శించు కున్నారు.  వీరికి ఆలయ చైర్మన్‌ రవిప్రకాష్‌ గౌడ్‌, ఈవో ప్రేమ్‌కుమార్‌, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన,  ప్రత్యేక పూజలు చేయించారు. వీరి వెంట సీనియర్‌ డివిజనల్‌ ఆపరేషన్‌ మేనే జర్‌ వెంకన్న, సీనియర్‌ కమర్షియల్‌  మేనేజర్‌  రాజ్‌కుమార్‌, మోతిలాల్‌ నాయక్‌, ట్రాఫిక్‌ ఇంజనీర్‌ నీల పావని, డివిజనల్‌ ఇంజనీర్‌ అనిల్‌కుమార్‌, సీనియర్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ జశిత్‌, మున్నాజీరావు ఉన్నారు. 

 హైలెవల్‌ ప్లాట్‌ఫారం ఏర్పాటు చేయాలి

 జోగుళాంబ రైల్వేస్టేషన్‌ హాల్ట్‌లో హైలెవల్‌ ప్లాట్‌ ఫారం, ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు నిలుపుదల, ఆలయాల ప్రాశస్త్యం గురించి జోగుళాంబ హాల్ట్‌ నందు గోడలపై పెయింటింగ్‌ వేయించా లని,  జోగుళాంబ హాల్ట్‌ వద్ద ర హదారిపై అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి బదులుగా ప్లై ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని రైల్వే మేనేజర్‌కు ఆలయ చైర్మన్‌ రవిప్రకాష్‌ గౌడ్‌ వినతిపత్రం అం దజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వెంకట్రామయ్య శెట్టి, కే. నాగరాజు,  ప్రధాన అర్చకులు డి. ఆనంద్‌ శర్మ, అర్చకులు ధనుంజయ శర్మ ఉన్నారు. 

Updated Date - 2021-08-22T04:14:58+05:30 IST