పది తర్వాత వాహనాలు కనిపిస్తే సీజ్‌

ABN , First Publish Date - 2021-05-21T05:21:02+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గురువారం 9వ రోజు లాక్‌డౌన్‌ కొనసాగింది.

పది తర్వాత వాహనాలు కనిపిస్తే సీజ్‌
లాక్‌ డౌన్‌తో జిల్లా కేంద్రంలో బోసి పోయిన సత్యనారాయణ చౌరస్తా

- లాక్‌డౌన్‌ను పర్యవేక్షించిన డీఎస్పీ మధుసూదన్‌ రావు

- జిల్లాలో కొనసాగిన 9వ రోజు లాక్‌ డౌన్‌

నారాయణపేట/ నారాయణపేట క్రైం/ నర్వ/ మక్తల్‌/ మద్దూర్‌, మే 20 : జిల్లా వ్యాప్తంగా గురువారం 9వ రోజు లాక్‌డౌన్‌ కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు ఉన్న మినహాయింపు సమయంలో సరు కులు కొనుగోలు చేసేందుకు మునిసిపల్‌ కేంద్రాలతో పాటు మండల కేంద్రా ల్లో కిరాణాకొట్లకు, కూరగాయలు, పండ్లు, పాలు కొనుగోలు చేసేందుకు జనాలు బారులు తీరారు. పట్టణ రహదారుల్లో రద్దీ ఏర్పడింది. జిల్లా సరిహ ద్దుల్లో ఐదు చెక్‌ పోస్టులను ఎస్పీ చేతన ఎప్పటికప్పుడు పరవేక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం తర్వాత రోడ్లపై వాహనాలు కనిపిస్తే సీజ్‌ చేస్తామని డీఎస్పీ మధుసూదన్‌రావు వాహన చోదకులను హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ తీరును డీఎస్పీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. అనవసరంగా బయటకు వచ్చిన వాహనాలను తనిఖీచేసి డీఎస్పీ ఆధ్వర్యంలో సత్యనారాయణచౌరస్తా, అంబేడ్కర్‌ చౌరస్తాల వద్ద చలాన్లు విధిం చారు. ఈయన వెంట సీఐ శ్రీకాంత్‌రెడ్డి, టౌన్‌ ఎస్‌ఐ సైదయ్య ఉన్నారు. మండల కేంద్రమైన నర్వతోపాటు ఆయా గ్రామాల్లో గురువారం లాక్‌డౌన్‌ను ఎస్‌ఐ ఎం.డి. నవీద్‌ తన సిబ్బందితో మూడు టీములుగా ఏర్పడి పర్యవేక్షిం చారు. మక్తల్‌లో ఎస్‌ఐ ఏ.రాములు ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌న పర్యవేక్షించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినా ప్రజల అగాహన రాహిత్యంతో అదిపూర్తి స్థాయి ఫలితం కన్పించడంలేదు. గురువారం మద్దూర్‌ సంతలో  వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో సంత కిక్కిరిసిపోయింది. 

Updated Date - 2021-05-21T05:21:02+05:30 IST