సాంకేతికతతో సాగు చేయాలి
ABN , First Publish Date - 2021-10-21T05:41:03+05:30 IST
యంత్ర పరికరాలు, సాంకేతిక పద్ధతులతో సాగు లాభదాయకంగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూర్ గ్రామంలో బుధవారం మాజీ ఎంపీపీ తిర్మల్‌రెడ్డి అధ్వర్యంలో రైతు మేళా ఏర్పాటు చేశారు.
అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం 8 అయిజ మండలం ఉత్తనూర్‌లో రైతు మేళా
కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ నుంచి తరలొచ్చిన రైతులు
అయిజ, అక్టోబరు 20 : యంత్ర పరికరాలు, సాంకేతిక పద్ధతులతో సాగు లాభదాయకంగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూర్ గ్రామంలో బుధవారం మాజీ ఎంపీపీ తిర్మల్‌రెడ్డి అధ్వర్యంలో రైతు మేళా ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన ఎమ్మెల్యే అబ్రహాం వివిధ రకాల వ్యవసాయ స్టాళ్లను ప్రారంభించి మాట్లాడారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని రైతులకు సూచించారు. నూతన వ్యవసాయ యంత్ర పరికరాలతో సాగుచేసి తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం వైద్యం, విద్యకు పెద్దపీట వేసిందని, అందులో భాగంగా నియోజకవర్గానికి వచ్చిన నిధులలో 40 శాతం విద్యాభివృద్ధికి ఖర్చుచేయాలని నిర్దేశించారని గుర్తుచేశారు. పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఎస్‌జీటీలకు న్యాయం చేయటం కోసం 5,500 ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ నూతన వ్యవసాయ పద ్ధతులతో సాగు లాభదాయకమన్నారు. కొత్తపల్లిలో గోడకూలిన బాధితులకు ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ తరఫున రూ. 2 లక్షల డీడీని అందజేశారు. మాజీ ఎంపీపీ తిర్మల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆశయసాధనలో భాగంగా రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో దాతల సహకారంతో రైతు మేళాను ఏర్పాటు చేశానని చెప్పారు. రైతులు సంప్రదాయ పద్ధతులతో కాకుండా సాంకేతికతను తెలుసుకొని సాగుచేసి అధిక దిగుబడి సాధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారులు గోవిందనాయక్, షక్రియానాయక్, శంకర్‌లాల్, డీఆర్‌డీవో సంధ్య, ఉమ్మడి రాష్ట్ర వయోజన విద్య మాజీ సంచాలకులు పోతుల జనార్దన్‌రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, మాజీ ఎంపీపీ సుందర్‌రాజ్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షులు రాముడు, మండల పార్టీ అధ్యక్షులు తూముకుంట రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.