ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్లే గన్నీ బ్యాగుల కొరత
ABN , First Publish Date - 2021-05-21T05:21:44+05:30 IST
ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్లే గన్నీ బ్యాగుల, లారీల కొరత ఏర్పడిందని మాజీ జడ్పీటీసీ వాకిటి శ్రీహరి అన్నారు.

మాగనూర్, మే 20 : ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్లే గన్నీ బ్యాగుల, లారీల కొరత ఏర్పడిందని మాజీ జడ్పీటీసీ వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మాగనూర్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, మక్తల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సిములుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణ, మాగనూర్ మండలాల్లో 19వేల ఎకరా లకు పైగా రైతులు వరిపంటను సాగు చేశా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి గింజ కొంటామంటారే తప్ప ఆచరణలో అమలు లేదని వారు మండిపడ్డారు. ఒక పక్క వర్షాలు రావడంతో కల్లాల వద్దనే ధాన్యం నానడం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నార న్నారు. అఽధికారులు, ప్రజాప్రతినిధులు స్పం దించి రెండు మూడు రోజుల్లో గన్నీ బ్యాగు లు, లారీల సమస్య లేకుండా చూడాలన్నారు. లేని పక్షంలో ఉమ్మడి కృష్ణ మాగనూర్ మండలాల రైతుల ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల నాయకులు కృష్ణయ్య, చక్రపాణిరెడ్డి, దండు ఆనంద్, దండు బస్వారాజ్ తదితరులు పాల్గొన్నారు.