యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా శివసేనారెడ్డి
ABN , First Publish Date - 2021-01-09T03:29:46+05:30 IST
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి మరోసారి పాలమూరుకే దక్కింది.
- ఉమ్మడి పాలమూరు జిల్లాకు మూడోసారి లభించిన పదవి
వనపర్తి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి మరోసారి పాలమూరుకే దక్కింది. గతం లో ఏఐసీసీ కార్యదర్శులు జిల్లెల చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్‌రె డ్డికి ఈ పదువులు దక్కగా, తాజాగా వనపర్తి జిల్లా పెద్దగూ డెం గ్రామానికి చెందిన కొత్తకాపు శివసేనారెడ్డిని ఈ పదవి వ రించింది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈసారి ఐవైసీ యాప్ ద్వారా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగగా, శివసేనారెడ్డి 59,997 ఓట్లతో అందరికంటే ముందు స్థానంలో నిలిచారు. తర్వాత స్థానాల్లో రాజీవ్‌రెడ్డి, పొరికే సా యి నిలిచారు. ఓట్ల ద్వారా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి డిసెంబర్‌లో కేంద్ర నాయకత్వం ఇంటర్వ్యూలు నిర్వ హించింది. ఇందులో శివసేనారెడ్డికి అధ్యక్ష పదవి ఖరారైనా, పీసీసీ అధ్యక్షులను ప్రకటించిన తర్వాత యూత్ కాంగ్రెస్ కమిటీని ప్రకటించాలని భావించారు. అయితే, పీసీసీ ఇంకా ఆలస్యమవుతుందని ఏఐసీసీ ప్రకటించడంతో యూత్ కాంగ్రె స్ ఎన్నికల కమిషన్ గురువారం రాత్రి అధ్యక్షుడిగా శివసేనా రెడ్డిని ప్రకటించింది.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి ఎన్నిక కావడం తో భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్షుడి గా ఎన్నికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ను శివసేనారెడ్డి ఢిల్లీలో మర్యాదపూర్వకం గా కలిశారు. పార్టీ బలోపేతంలో యూత్ కాంగ్రెస్ పాత్ర, భ విష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క నా యకుడిని కలుపుకుపోతూ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా యూత్ కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, అన్ని అను బంధ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పోతుందని శు క్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు.
కాగా, పెద్దగూడెంకు చెందిన శివసేనారెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గీతం యూనివర్సిటీలో ఏరోనాటిక ల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన, ఎన్‌ఎస్‌యూఐలో పలు పదవుల్లో పని చేశారు. ఎన్‌ఎస్‌యూఐ ఉమ్మడి జిల్లా ఉపా ద్యక్షుడిగా, తర్వాత నాగర్‌కర్నూలు పార్లమెంట్ యూత్ కాంగ్రె స్ అధ్యక్షుడిగా మొన్నటివరకు పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.